Dantewada Encounter | ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్‌లో శనివారం ఉదయం ముగ్గురు మావోలు చనిపోయారని.. సంఘటనా స్థలం నుంచి ముగ్గురి మృతదేహాలతో పాటు భారీగా మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మార్చి 2026 నాటికి మావోయిస్ట్ రహితంగా భారత్ లక్ష్యంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులు ఆయుధాలను విడవాలని పిలుపునిచ్చారని.. అయినా నేర కార్యకలాపాలకు మావోలు పాల్పడుతున్నారని తెలిపారు.
ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. శనివారం ఉదయం 9 గంటలకు భద్రతా దళాల సంయుక్త బృందం ఆపరేషన్ ప్రారంభించిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చి 20న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన రెండు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో 30 మంది భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇక 2025లో ఇప్పటి వరకు నిర్వహించిన 11 ఆపరేషన్లలో దాదాపు 142 మంది మావోయిస్టులను బలగాలు ఎన్కౌంటర్లో హతమార్చాయి. ఈ ఏడాది భద్రతా బలగాలు సాధించిన ప్రధాన విజయాల్లో ఫిబ్రవరి 91న 31 మంది మావోలను, మార్చి 25న 16 మంది మావోయిస్టులను హతమార్చాయి. బస్తర్, దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్లు జరిగాయి.