Cricket Ball Kills Boy | పుణేలో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన క్రికెట్ బంతి
Cricket Ball Kills Boy : వేసవి సెలవుల్లో సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ బాలుడు అనుకోకుండా మృత్యు ఒడికి చేరాడు. బంతి అతడి మర్మాంగాల(Private Parts)కు బలంగా తాకడంతో ఉన్నచోటనే ప్రాణాలు విడిచాడు.
Cricket Ball Kills Boy : వేసవి సెలవుల్లో సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ బాలుడు అనుకోకుండా మృత్యు ఒడికి చేరాడు. బంతి అతడి మర్మాంగాల(Private Parts)కు బలంగా తాకడంతో ఉన్నచోటనే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక సంఘటన పుణేలో మే 2వ తేదీ గురువారం జరిగింది. అసలేం జరిగిందంటే..? శౌర్య కాళిదాస్(Shourya Kalidas) అనే 11 ఏండ్ల బాలుడు ఆ రోజు రాత్రి స్నేహితులతో కలిసి అక్కడి జగత్గురు స్పోర్ట్స్ అకాడమీలో క్రికెట్ ఆడుతున్నాడు.
అయితే.. ఆట మధ్యలో బంతి అనూహ్యంగా శౌర్య ప్రైవేట్ పార్ట్స్‌కు తగిలింది. దాంతో, నొప్పితో విలవిలలాడిని అతడు మైదానంలోనే కుప్పకూలాడు. అతడలా పడిపోవడం చూసిన స్నేహితులు పరుగున వచ్చి.. శౌర్యను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
VIDEO | In a shocking incident in #Pune, an 11-year-old boy died while playing cricket after a ball hit his private part.
The deceased has been identified as Shaurya Khadwe.
The incident happened in #Lohegaon on Thursday.https://t.co/0QTgGuCC6K pic.twitter.com/7F7vB3On6E
— Free Press Journal (@fpjindia) May 6, 2024
కానీ, అప్పటికే అతడు మరణించాడని అక్కడి వైద్యులు చెప్పారు. అతడి మరణవార్తతో శౌర్య తల్లిదండ్రులు, స్నేహితులు లబోదిబోమన్నారు. స్పోర్ట్స్ అకాడమీలోని సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. శౌర్య ప్రమాదవశాత్తు మృతి చెందాడని కేసు నమోదు చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

