భద్రాద్రికి పోటెత్తిన భక్తులు
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వారాంతపు సెలవు దినాలు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భద్రాద్రికి వచ్చారు.
భద్రాచలం, మే 26: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వారాంతపు సెలవు దినాలు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భద్రాద్రికి వచ్చారు. రామయ్యను దర్శించుకునేందుకు అందరూ ఒకేరోజు, ఒకేసారి వచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయింది. రద్దీని ముందుగానే ఊహించిన ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగలేదు. ఆలయ ప్రాంగణంలోనూ, క్యూలైన్లలోనూ ‘జై శ్రీరామ్’ అనే జయజయధ్వానాలతో ధ్వనించాయి.
రామయ్యకు స్వర్ణ పుష్పార్చన
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు 108 స్వర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్య బలిహరణం తదితర నిత్య పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆదివారం సందర్భంగా ఉదయం అంతరాలయంలోని మూలవరులకు ప్రత్యేక అభిషేకం జరిపారు. ఈ అభిషేకంలో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకొని మురిసిపోయారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను చిత్రకూట మండపానికి తీసుకొని వచ్చి సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణం జరిపి కల్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేషవస్ర్తాలను అందజేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

