నిలకడకు నిలువుటద్దం!
దశాబ్ద కాలం తర్వాత ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడిన కేకేఆర్ సీజన్ ఆసాంతం నిలకడగా రాణించింది. రెండు సీజన్లలో ఏడో స్థానంతో ముగించిన ఆ జట్టు 2024లో మాత్రం కచ్చితంగా కప్పు కొట్టాలనే కృతనిశ్చయంతో టోర్నీని ఆరంభించింది.
దశాబ్ద కాలం తర్వాత ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడిన కేకేఆర్ సీజన్ ఆసాంతం నిలకడగా రాణించింది. రెండు సీజన్లలో ఏడో స్థానంతో ముగించిన ఆ జట్టు 2024లో మాత్రం కచ్చితంగా కప్పు కొట్టాలనే కృతనిశ్చయంతో టోర్నీని ఆరంభించింది. తమకు రెండుసార్లు ట్రోఫీని అందించిన గౌతం గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకోవడంతో పాటు వేలంలో స్టార్క్ కు రూ. 24 కోట్లు వెచ్చించిన నైట్‌రైడర్స్.. తమ ప్రణాళికను అక్కడ్నుంచే విజయవంతంగా అమలుచేసింది.
పదిజట్ల రణక్షేత్రంలో దిగిన కోల్‌కతా.. ఓపెనర్‌గా నరైన్‌ను పంపించి సగం సక్సెస్ అయ్యింది. ఓపెనర్ (482 పరుగులు)గా విధ్వంసరచన చేసిన అతడు.. బంతితోనూ (17 వికెట్లు) అదరగొట్టాడు. ఫిల్ సాల్ట్ (435) చేసింది తక్కువేమీ కాదు. కేకేఆర్ విజయాలలో ఈ ఇద్దరిదే కీలకపాత్ర. మిడిలార్డర్లో రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రస్సెల్ తలా ఓ చేయి వేస్తే ఆఖర్లో రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్ అదిరిపోయే ముగింపులనిచ్చారు. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా స్టార్క్ (17 వికెట్లు) నాకౌట్‌కు వచ్చేసరికి తన ‘ప్రైమ్ మోడ్’లోకి వెళ్లిపోయాడు. నాకౌట్లో అతడి బౌలింగ్ ప్రదర్శనలే (3/34, 2/14) ఇందుకు తార్కాణం.
ఈసీజన్లో కేకేఆర్‌కు దొరికిన మరో పేస్ ఆణిముత్యం హర్షిత్ రాణా (19). ఆండ్రీ రస్సెల్ బ్యాట్‌తో పాటు బంతి (19) తోనూ అద్భుతాలు సృష్టించాడు. వరుణ్ చక్రవర్తి (21) స్పిన్‌తో ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. ఇక ప్లేఆఫ్స్ దాకా (14 మ్యాచ్‌లలో 9 విజయాలతో 20 పాయింట్లు) ఓ రేంజ్ ఆట ఆడిన కేకేఆర్.. నాకౌట్ దశలో ‘ప్రీమియర్’ ఆట చూపించి ట్రోఫీని సొంతం చేసుకుంది.. సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్స్‌లో రెండు సార్లూ చిత్తుగా ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. గౌతీ మెంటార్‌గా, చంద్రకాంత్ పండిట్ కఠినమైన కోచింగ్ పాఠాలతో పాటు శ్రేయస్ అయ్యర్ సారథ్య సామర్థ్యంతో కోల్‌కతా.. చెపాక్‌లో కొత్త కథను రాసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- IPL 2024
- IPL trophy
- KKR
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

