భద్రాద్రిలో 55 కేంద్రాల్లో ఎన్నికలు
ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఓటింగ్ జరుగనుంది.
- పటిష్ట భద్రత మధ్య సామగ్రిని తీసుకెళ్లాలి: భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఓటింగ్ జరుగనుంది. ఈ మేరకు సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకొని ఎన్నికల సిబ్బంది ఆదివారం సాయంత్రానికే తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. లక్ష్మీదేవిపల్లి శ్రీరామచంద్రా డిగ్రీ కాలేజీలో మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రియాంక పరిశీలించి ఎన్నికల సిబ్బందికి మెటీరియల్ను అందజేశారు. 65 మంది పీవోలు, 65 మంది ఏపీఓలు, 152 మంది ఓపీవోలు కలిపి మొత్తం 282 మంది సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు.
జిల్లాలో 40,106 మంది ఓటర్లు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు మొత్తం 40,106 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 22,590, మహిళలు 17,516 మంది ఉన్నారు. అత్యధికంగా చుంచుపల్లి మండలం బాబూక్యాంపు 271వ బూత్లో 1145 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 252 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్: కలెక్టర్
సోమవారం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుందని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్రా కాలేజీలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించాల్సిన విధుల గురించి ఎన్నికల అధికారులకు, సిబ్బందికి మరోసారి వివరించారు. సామగ్రిని భద్రత మధ్య వాహనాల్లో తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ అయ్యాక తిరిగి ఇదే రిసెప్షన్ సెంటర్కు రావాల్సి ఉంటుందన్నారు. అనంతరం వాహనాలకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్ను కూడా పరిశీలించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీవోలు మధు, దామోదర్, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల అధికారులు దారా ప్రసాద్, రంగాప్రసాద్, సుశీల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

