అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొత్తకుంటపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ కథనం ప్రకారం..
లింగాల, మే 26 : చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొత్తకుంటపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్మోహన్ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తకుంటపల్లికి చెందిన శశాంక్‌రెడ్డి(32) బెట్టింగ్‌లు, ఇతర అలవాట్లకు బానిసగా మారి రూ.లక్ష అప్పు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో హైదరాబాద్ నుంచి లింగాలలోని తమ మామిడితోటకు చేరుకొని ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆదివారం తోటకు వెళ్లిన కుటుంబ సభ్యులకు చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి విష్ణువర్ధన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

