హరారే: జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలుపు బోణీ కొట్టింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్.. 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 174 పరుగుల ఛేదనలో సఫారీలు 18.2 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
డెవాల్డ్ బ్రెవిస్ (35), జార్జ్ లిండె (30) పోరాడారు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. 9.3 ఓవర్లలో 70 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయినా మూడో స్థానంలో వచ్చిన టిమ్ రాబిన్సన్ (57 బంతుల్లో 75, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెవాన్ జాకబ్స్ (44) ధాటిగా ఆడటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 173/5 స్కోరు చేసింది. రాబిన్సన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.