e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home సిద్దిపేట సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి
  • మద్దతు ధర ఇచ్చేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
  • చేగుంట, దుబ్బాక మండలాల పరిధిలో కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ
  • 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

చేగుంట/దుబ్బాక, ఏప్రిల్‌19:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి, దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్‌, చేగుంట సొసైటీ, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో బీ -కొండాపూర్‌, బోనాల, ఇబ్రహీంపూర్‌, చిన్నశివునూర్‌, పెద్దశివనూర్‌, గొల్లపల్లి,రుక్మాపూర్‌,అనంతసాగర్‌,ఉల్లితిమ్మాయిపల్లి, మక్కరాజిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీన్‌కుమార్‌, మండల రైతు సంఘం సమన్వయ కమిటీ అధ్యక్షుడు జింక శ్రీనివాస్‌, చేగుంట, ఇబ్రహీంపూర్‌, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్‌లు సండ్రుగు స్వామి, వంటరి కొండల్‌రెడ్డి, మ్యాకల పరమేశ్‌, సర్పంచ్‌లు అబ్రబోయిన మల్లయ్య, రాములు, బస్కి స్వప్న, కుమ్మరి శ్రీనివాస్‌, కాశబోయిన భాస్కర్‌,జానకి, ముదాం రుక్మిణి, మోహన్‌, ఎంపీటీసీలు నవీన్‌, గాండ్ల లత, బింగి గణేశ్‌,సొసైటీ వైస్‌ చైర్మన్లు పట్నం తానీషా, రాములు, మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, స్థానిక నాయకులు బండి విశ్వేశ్వర్‌, బుచ్చిరెడ్డి, రంగాయ్యగారి రాజిరెడ్డి, తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో ప్రశాం త్‌, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏఏవో మాధవి, ప్రవీన్‌, సీసీలు రామస్వామి, అంజయ్యనాయక్‌, జీ స్వామి, మహిళా కమిటీ సభ్యులు తదితరులున్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత..
నిరుపేద పేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరమని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం 26 మంది లబ్ధిదారులకు కల్యాణ్యలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి అందజేశారు. అనంతరం మండల పరిధిలో నూతంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ సోమ్లా తండాలో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కల్మాణలక్ష్మి పథకంతో పేద ఇంటి ఆడపిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని, కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో వాటికి కొత్త భవనాలను నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. చేగుంటలో ప్రారంభానికి సిద్ధమైన మార్కెట్‌ కమిటీ షెడ్‌లను, తహసీల్‌ కార్యాలయాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తదితరులున్నారు.

దుబ్బాక మండలం పరిధిలో..
దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో ఐకేపీ, మార్కెట్‌యార్డులో ఏఎంసీ, మల్లాయిపల్లిలో పీఏసీఎస్‌, చెల్లాపూర్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. దుబ్బాక మార్కెట్‌ యార్డులో రైతులకు తాగునీటి కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి సృష్టించారని కొనియడారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరించిన విషయం తెలిసిందేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌, దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలతారెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ బండి శ్రీలేఖ, వైస్‌ ఎంపీపీ అస్క రవి, పీఏసీ ఎస్‌ వైస్‌చైర్మన్‌ కాల్వ నరేశ్‌, నాయకులు రొట్టే రాజమౌళి, కిషన్‌రెడ్డి, బండి రాజు, బాలకిషన్‌గౌడ్‌, కౌన్సిలర్లు దేవలక్ష్మి, ఆస యాదగిరి, మల్లారెడ్డి, రజిత, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలం పరిధిలోని పోతారం గ్రామానికి చెందిన బండి భారతమ్మ ఆనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందగా, వైద్య ఖర్చులకు రూ. 3 లక్షల ఎల్వోసీని ఎంపీ అందజేశారు. పోతారెడ్డిపేటలో ఈ నెల 23న నిర్వహించనున్న పెద్దమ్మ దేవీ కల్యాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రాజమౌళి, చింతల కృష్ణ తదితరులున్నారు.

ఇవీ కూడా చదవండి…

ముగిసిన నామినేషన్ల పరిశీలన

వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయండి

బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌గా శంషాబాద్‌

Advertisement
సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement