బక్రీద్ సందర్భంగా ఖుర్బానీలో గోవును బలి ఇవ్వొద్దు
బక్రీద్ పర్వదినం సందర్భంగా ఖుర్బానీలో గోవులను కోయవద్దని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. బుధవారం కోదాడ పెద్ద మసీదులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవులను వధించవద్దని...
కోదాడ, మే 27 : బక్రీద్ పర్వదినం సందర్భంగా ఖుర్బానీలో గోవులను కోయవద్దని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. బుధవారం కోదాడ పెద్ద మసీదులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవులను వధించవద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ముస్లింలందరూ పాటించాలని పిలుపునిచ్చారు. జాతీయస్థాయిలో మత పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని, వారి నిర్ణయం మేరకు గోవులను కుర్బానీ ఇవ్వవద్దన్నారు. ఆవును జాతీయ జంతువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సర్వ మతాలను గౌరవించాలని, ఎవరి మనోభావాలను దెబ్బతీయ వద్దన్నారు. భారతదేశం లౌకిక దేశం అని, దేశంలో అందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండాలన్నారు. బక్రీద్ పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించ వద్దన్నారు. ఈ సమావేశంలో మత పెద్దలు ఎస్ కే ముఫ్టీ అతహర్, మౌలానా అహమ్మద్ నాద్వి, మౌలనా అయూబ్, మౌలానా హామీద్, మౌలానా అతహార్, ఆఫీస్ సిరాజ్, ముక్తి అబ్దుల్ ఖాదిర్, షమ్మీ, జహీర్,కాజా, బాబు సాహెబ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

