చండూరు, మే 27 : పిడుగు పడడంతో ఎద్దు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాస్కానీగూడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గాలి దుమారం రావడంతో గ్రామంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పగిళ్ల శేఖర్ అనే వ్యక్తికి చెందిన ఎద్దు పిడుగు పడడంతో మరణించింది. శేఖర్ కు సెంటు భూమి కూడా లేకపోవడంతో గ్రామంలోని రైతు వద్ద కౌలుకు భూమిని తీసుకుని వ్యవసాయ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వ్యవసాయానికి అవసరమని రూ.1,60,000 అప్పుచేసి రెండు ఎద్దులను కొనుగోలు చేయగా వాటిలో ఒకటి పిడుగుపాటుకు మృతిచెందింది. దీంతో 80 వేల నష్టం వాటిల్లినట్లుగా పేర్కొంటూ ఎద్దు మరణంతో శేఖర్ కుటుంబం కన్నీరు మున్నేరుగా విలపించింది. ప్రభుత్వం, దాతలు తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంది.