Pat Cummins : పంతొమ్మిదో సీజన్లో టాప్ గేర్ ఆటతో ఎలిమినేటర్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కఠినమైన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను ఢీకొట్టనుంది. ముల్లన్‌పూర్‌లో రాజస్థాన్‌కు చెక్ పెట్టి క్వాలిఫయర్ 2 ఆడాలని సన్‌రైజర్స్ పట్టుదలతో ఉంది. అయితే.. ఆకాశమే హద్దులా చెలరేగే వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) రూపంలో పెద్ద ప్రమాదం ప్యాట్ కమిన్స్(Pat Cummins) సేనకు పొంచి ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చేసే వైభవ్‌ను కట్టడి చేస్తేనే విజయంపై ఆశలుంటాయి. ఈ నేపథ్యంలో.. తుఫాన్ ఇన్నింగ్స్‌లతో బౌలర్లను వణికించే ఈ చిచ్చరపిడుగును నిలువరించేందుకు తమ వద్ద ప్లాన్ ఏ, బీ.. ఈ రెండూ విఫలమైతే ప్లాన్ సీ ఉందని కమిన్స్ చెప్పాడు.
ముల్లన్‌పూర్‌లో మరికాసేపట్లో సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. గెలిస్తేనే ముందుకు.. లేదంటే ఇంటికి అనే పరిస్థితిలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. సో .. మ్యాచ్ సన్నద్ధత గురించి మీడియా సమావేశంలో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ తమ వ్యూహాలను వివరించాడు. ‘నేను జట్టులో బ్యాలన్స్ ఉండాలనుకుంటా. ఒక బౌలర్‌గా జట్టుకు ఏం చేయగలం.. మన బలానికి తగ్గట్టు బౌలింగ్ చేయడంపై దృష్టి సారిస్తా.
🚨 PAT CUMMINS MASSIVE STATEMENT ON VAIBHAV SURYAVANSHI AHEAD OF SRH VS RR MATCH 🚨
Pat Cummins said 🗣️,
“Yeah, it’s always the balance of, you know, you as a bowler, what do you do well? How are you going to bowl to your strengths? But then when, you know, when there’s… pic.twitter.com/X0TbPoNG9t
— Cricket Central (@CricketCentrl) May 27, 2026
ప్రతి జట్టులో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే ఆటగాళ్లు ఒకరిద్దరు ఉంటారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ అవసరం. వైభవ్ సూర్యవంశీ కోసం కూడా మేము ప్రణాళికలు వేస్తున్నాం. గత మ్యాచ్‌లో అతడు మాపై శతకం బాదాడు. అయితే.. ఇదివరకు మేము గొప్పగా బౌలింగ్ చేసి వైభవ్‌ను కట్టడి చేశాం. ఎలిమినేటర్‌ను మేము మొదటి ఆటగానే భావిస్తాం. గత మ్యాచ్‌ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని కమిన్స్ వెల్లడించాడు.
లీగ్ దశలో రాజస్థాన్, సన్‌రైజర్స్ చెరొక మ్యాచ్‌లో గెలిచాయి. ఉప్పల్‌లో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లు తలా నాలుగేసి వికెట్లు తీయగా 587 పరుగుల తేడాతో రాజస్థాన్ చిత్తైంది. ఆ ఓటమికి జైపూర్‌లో పరాగ్ సేన ప్రతీకారం తీర్చుకుంది. వైభవ్ విధ్వంసక శతకం(37 బంతుల్లో 103)తో మ్యాచ్‌ను శాసించగా కమిన్స్ సేన కంగుతిన్నది. మరి.. ఎలిమినేటర్‌లో ఏం జరుగుతుంది? అనేది ఆసక్తి రేపుతోంది.
