మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Feb 24, 2021 , 00:01:40

నేటినుంచి బడిబాట

నేటినుంచి బడిబాట

తెరుచుకోనున్న 6, 7, 8 తరగతులు 

పాఠశాలలను సర్వసిద్ధం చేయాలి

ఒక్క విద్యార్థి హాజరైనా బడిని తెరవాలి

డీఈవో ఆఫీస్‌లో కంట్రోల్‌ రూమ్‌  

కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

    సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 23 : జిల్లాలో నేటి నుంచి బడిబాట ప్రారంభం కానున్నది.. 6, 7, 8 తరగతులు ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులనే కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ ముజామ్మీల్‌ఖాన్‌, డీఈవో రవికాంతారావు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 606 పాఠశాలల్లో 6,7,8 తరగతులను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఆయా పాఠశాలలు రోజువారీ నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో ఎంపీడీవో, మండల ప్రత్యేకాధికారి, ఎంఈవో క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించి పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయాలన్నారు. డీఈవో ఆఫీస్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులకు హాజరు కావాలని, విధిగా హాజరు కా వాలని నిబంధన లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించా రు. సుదీర్ఘ కాలం తరువాత పాఠశాలలు ప్రారంభమవుతున్నందునా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడంతో పాటు, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు.

VIDEOS

logo