శనివారం 06 మార్చి 2021
Siddipet - Feb 22, 2021 , 02:33:41

సేవలతోనే గుర్తింపు..

సేవలతోనే గుర్తింపు..

  • మాతృభాషను మరిచిపోవద్దు
  • లయన్స్‌క్లబ్‌ సేవలు వెలకట్టలేనివి
  • సామాజిక, రాజకీయ సేవల్లో ‘లయన్స్‌' ఉప్పల మెట్టయ్య భేష్‌
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌ అర్బన్‌, ఫిబ్రవరి 21 : సమాజానికి చేసిన సేవలే మనిషిని గొప్పవ్యక్తిగా మా ర్చుతాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో లయన్స్‌క్లబ్‌ ఇంటర్నేషనల్‌ రీజియన్‌ చైర్మన్‌గా స్థానిక కౌన్సిలర్‌ ఉప్పలమెట్టయ్య ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మెట్టయ్యను ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సమాజ సేవ చేయడానికి ధనవంతులు కానవసరం లేదని, డబ్బుతోనే కాకుండా తమ చేతనైన విధంగా సమాజానికి సహాయం చేయవచ్చన్నారు. మనిషి చేసిన సేవ, సహాయంతోనే అతను గొప్పవ్యక్తి గా కీర్తించబడుతాడన్నారు. మాతృభాష దినోత్సవ సందర్భంగా సభికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంగ్లిషు మీడియంలో చదివే చిన్నారులకు తెలుగు భాషను రాయడం, చదవడం, మా ట్లాడడం బాగా నేర్పించాలని సూచించారు. కరోనా సమయంలో సేవలందించిన ప్రభుత్వ ఉపాధ్యాయులను లయన్స్‌క్లబ్‌ ప్రతి నిధులు సన్మానించడమే కాకుండా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారని అభినందించారు. లయన్స్‌క్లబ్‌ ద్వారా రక్తదానం, అన్నదానం, విద్యాదానం, వైద్యదానం ఇతర ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు క్లబ్‌లో సభ్యుడిగా తనకు సంతో షంగా ఉందన్నారు. గజ్వేల్‌ రీజియన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కౌన్సిలర్‌ మెట్టయ్య ప్రజలకు సేవలందిస్తున్నారని అభినం దించారు. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా మెట్టయ్య కూడా సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ సూర్యరాజ్‌, వైస్‌ గవర్నర్‌ రామకృష్ణారెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్‌, మర్రి ప్రవీణ్‌, గంప రమేశ్‌, సంజయ్‌గుప్తా, విజయ్‌భాస్కర్‌, పరమేశ్వరచారి, జానకిరాం, రాంఫణిధర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo