అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నా..
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కవిత కళాశాల పోలింగ్ బూత్‌లో నామా, అతడి కుటుంబ సభ్యులు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- ఖమ్మం పార్లమెంట్’ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
- ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో గెలుస్తున్నాం: వద్దిరాజు
మామిళ్లగూడెం/ , మే 13: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కవిత కళాశాల పోలింగ్ బూత్‌లో నామా, అతడి కుటుంబ సభ్యులు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పోలింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఓటర్లు బీఆర్ఎస్ పక్షానే నిలిచారని అర్థమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలే తనను గెలిపిస్తాయని అన్నారు.
పోలింగ్ సరళి పరిశీలన..
కాగా, జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పరిశీలించారు. పోలింగ్ సరళి గురించి అడిగి తెలుసుకున్నారు. పలు కేంద్రాల్లో ఓటర్లు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే ఫోన్లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిషరించారు.
రెండు స్థానాల్లో గెలుస్తున్నాం: వద్దిరాజు
ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువబోతున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
ఓటు హక్కు వినియోగించుకున్న అజయ్
కాగా, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దంపతులు ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

