లోక్‌సభ ఎన్నికల మహాసంగ్రాహం సోమవారం ముగిసింది. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరగా వారందరికీ ఓటు వేసేందుకు అవశాకం కల్పించారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో స్వగ్రామంలో గులాబీ అధినేత కేసీఆర్ దంపతులు, సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తన కుంటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇతర ప్రముఖులు వారి స్వగ్రామాల్లో ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్చైర్లు, వాహనాలు ఏర్పాటు చేయడంతో వారంతా ఓటు హక్కును వినియోగించుకన్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
– సిద్దిపేట జిల్లా నెట్వర్క్, మే13