రామచంద్రాపురం, మే 13: ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలు ఓటు హక్కును వినియోగించు కోవడం సంతోషంగా ఉందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. తెల్లాపూర్‌లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత రాజ్యాం గం ద్వారా మనకు గొప్ప అవకాశం ఓటు రూపంలో లభించిందన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే మంచి గణత సాధించిందన్నారు. డాక్టర్ బీఆర్ఎస్ అంబేద్కర్ మనకు కల్పించిన ఓటు హక్కుతో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అని చెప్పారు. దేశ, రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకుడు సోమిరెడ్డి ఉన్నారు.