బుధవారం 03 మార్చి 2021
Siddipet - Dec 24, 2020 , 22:58:04

పెండ్లి పందిట్లో కల్యాణలక్ష్మి చెక్కు అందజేత

పెండ్లి పందిట్లో కల్యాణలక్ష్మి చెక్కు అందజేత

చిన్నకోడూరు : పెండ్లి పందిట్లో కల్యాణలక్ష్మి చెక్కును మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అందజేశారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్‌ గ్రామానికి చెందిన రాకేశ్‌, లత వివాహానికి ఎమ్మెల్యే హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం రామాజిపేట గ్రామానికి చెందిన లతకు తల్లిదండ్రులు లేకపోవడంతో అబ్బాయి తరఫు వారు అమ్మాయిని మాచాపూర్‌కు తీసుకొచ్చి వివాహం చేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును వధువు లతకు పెండ్లి పందిట్లో అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, మీడియా సెల్‌ ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ బాబు, ఎంపీటీసీ జమున ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo