అవకాశాలను అందిపుచ్చుకోవాలి

సిద్దిపేట టౌన్: ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రపంచంలోని బెస్ట్ ప్రాక్టీసును పరిచయం చేస్తూ, అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దేందుకు సిద్దిపేటలో ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శ్రీహరి ప్రీత్‌సింగ్‌తో కలిసి సోమవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత మానన వనరుల అభివృద్ధి సంస్థ తొలిసారిగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోనే ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా నిరుద్యోగ, విద్యార్థిని విద్యార్థులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉపయోగకరంగా ఉండాలనే శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రంలో విద్యా సంస్థలు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల ఫ్యాకల్టీ నుంచి ఆన్లైన్ విధానంలో శిక్షణా తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఆయా అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు చేజిక్కుంచుకునేలా అధ్యాపకులు సన్నద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువతలో సామర్థ్యాలు పెంపుదలకు అందరూ కృషి చేస్తేనే సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణ సాకారమవుతుందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అనంతరం సాంకేతికత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ప్రాంతీయ శిక్షణా కేంద్రం ఇక్కడ ఏర్పాటైందన్నారు. విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందనే శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు, విద్యార్థులకు అన్ని విధాలా ఈ శిక్షణా కేంద్రం ఉపయోగపడుతుందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. ఈశిక్షణా కేంద్రం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ సీనియర్ ఫ్యాకల్టీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్.ఉషారాణి, ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, కౌన్సిలర్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
సిద్దిపేట నేలలో శక్తి ఉంది
- ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శ్రీహరి ప్రీత్‌సింగ్
“సిద్దిపేట నేలలోనే ఏదో శక్తి దాగి ఉన్నది. గతంలో నేను ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు సిద్దిపేట పట్టణం పెద్ద పట్టణంగా అవతరిస్తుందని అనుకున్న. ఇప్పుడు సిద్దిపేట పట్టణం అన్ని విధాలా అభివృద్ధి చెందిన పట్టణంగా మన ముందు కనబడుతున్నది. త్వరలోనే సిద్దిపేట పట్టణం పెద్ద పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందుతుంది. శామీర్‌పేటలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడితే సిద్దిపేట మరో హైదరాబాద్ నగరంగా మారుతుంది. విజన్ ఎగ్జిక్యూషన్ ఉన్న మంత్రి హరీశ్‌రావు.. ఆయన కృషి ఫలితంగానే సిద్దిపేటలో ప్రాంతీయ శిక్షణా కేంద్రం ఏర్పడింది” అని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శ్రీహరి ప్రీత్‌సింగ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీలు వెబ్ లింకు ద్వారా ఇక్కడ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, విద్యార్థినులకు వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుతామన్నారు.
తాజావార్తలు
- ప్రధాని మోదీ పేదలకు పనికిరానివాడు: రాహుల్‌గాంధీ
- ఒక్క కరోనా కేసు.. వారం రోజుల లాక్డౌన్
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు