శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 03, 2020 , 00:13:45

పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలి

పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలి

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ 

దుబ్బాక : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్‌ సిబ్బంది, కేంద్ర బలగాలు పటిష్ట బందోబస్తు చేపట్టాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి సూచించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా రూట్‌ మొబైల్‌ అధికారులు, సిబ్బందికి  దుబ్బాకలోని లచ్చపేట డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికకు ప్రాముఖ్యత ఉందని, అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రెస్టేజ్‌గా తీసుకుని ప్రచారం చేశాయన్నారు. నలుగురు అబ్జర్వర్‌ పోలింగ్‌కు మానిటర్‌ చేస్తారని తెలిసారు. పోలీసు అబ్జర్వర్‌ పోలీసుల  పనితీరు గురించి మానిటర్‌ చేస్తారని, సంబంధిత సెక్టార్‌ అధికారులతో మొబైల్‌ పార్టీ అధికారులు సమన్వయం చేసుకుని విధులు నిర్వహిస్తారని తెలిపారు. 

ఈవీఎం, వీవీ ప్యాట్‌, ఎన్నికల సామగ్రిని తీసుకుని వెళ్లేటప్పుడు జాగ్త్రతగా వెళ్లాలని , సెక్టర్‌ ఆఫీసర్‌ వెళ్లే రూట్‌లో మాత్రమే వెళ్లాలని, సెక్టర్‌ ఆఫీసర్‌ వెంట ఉండే  టీం రక్షణ బాధ్యత కూడా మొబైల్‌ పార్టీ అధికారులు తీసుకుంటారని సీపీ సూచించారు. సోమవారం నుంచి రూట్‌ మొబైల్‌ అధికారులు, సిబ్బంది వారి రూట్లలో 24X7 పెట్రోలింగ్‌ నిర్వస్తారన్నారు. రూట్‌ మొబైల్‌ అధికారుల వెంట సంబంధిత ఎస్సై, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ అధికారుల ఫోన్‌ నెంబర్లు  అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే చర్యలు ...

రూట్‌ మోబైల్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా సంబంధిత స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సీపీ జోయల్‌ డెవిస్‌ సూచించారు. 

రూట్‌ మొబైల్‌ వాహనంలో కమ్యూనికేషన్‌ వీహెచ్‌ఏఫ్‌ సెట్‌ ఏవిధంగా పనిచేస్తుందో ముందు చెక్‌ చేసుకోవాలని సూచించారు

మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని తెలిపారు. 

100 మీటర్ల లైనింగ్‌ వేయించాలని , లైనింగ్‌ లోపల పార్టీలకు సంబంధించిన ఫ్లాగ్‌ జెండాలు,ఉండకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. 

ఓటుహక్కు వినియోగించుకోవడానికి వాహనాలపై వచ్చేవారు 200 మీటర్ల బయటనే వాహనాలు పార్కింగ్‌ చేసుకుని, పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 

15 సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా , ప్రశాంత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు సీపీ డెవిస్‌ తెలిపారు. 

ఎన్నికల కమిషన్‌ పరిధిలో పనిచేస్తున్నామని, గుర్తించుకుని జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఇన్సిడెంట్‌ ప్రీ ఎన్నికల గురించి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. 

పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో నిర్వహించటానికి ప్రత్యేకంగా 63 స్షెషల్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 

గుర్తు తెలియని వ్యక్తులను ఎవరినీ పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు. 

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటించి విధులు నిర్వహించాలని సూచించారు. 

 సమావేశంలో వికారాబాద్‌ అడిషనల్‌ ఎస్పీ రషీద్‌ ఖాన్‌, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ , దుబ్బాక ఎన్నికల పోలీసుల నోడల్‌ అధికారి బాలాజీ పాల్గొన్నారు.  


VIDEOS

logo