సోమవారం 01 మార్చి 2021
Siddipet - Oct 11, 2020 , 00:44:02

జోరుగా టీఆర్‌ఎస్‌ ప్రచారం

జోరుగా టీఆర్‌ఎస్‌ ప్రచారం

  •  అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే
  • ఎక్కడికెళ్లినా ప్రజల బ్రహ్మరథం 
  • ఎన్నికల ప్రచారంలో  మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి 
  • ఆశీర్వదించి అక్కున చేర్చుకోండి : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత
  • కంటతడి పెట్టిన మహిళలు.. విరాళాల అందజేత
  • రేకులకుంటలో టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవ తీర్మానం 

దుబ్బాక : దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడమే  లక్ష్యంగా .. టీఆర్‌ఎస్‌ శ్రేణులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పార్టీ ఇన్‌చార్జిలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం  దుబ్బాక మండలం రేకులకుంట మల్లన్న దేవాలయంలో దేవాలయ చైర్మన్‌ రొట్టే రమేశ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లన్న దేవాలయ ఒగ్గు పూజారులు, వ్యాపారులు, నాయీ బ్రాహ్మణులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ.. సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటనర్సింహారెడ్డికు తీర్మానపత్రం అందజేశారు.

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు ఈర్షద్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో ఇంటింటా  ప్రచారం నిర్వహించారు. దుంపలపల్లిలో సిద్దిపేట రూరల్‌ జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు.  చీకోడ్‌లో, ఆరెపల్లిలో  టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో  ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే  గ్రామాల అభివృద్ధితోపాటు పేదలకు సముచిత న్యా యం చేకూరిందన్నారు. కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, యాదగిరి, పరశురాములు, సంపత్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo