గులాబీ జోష్

- టీఆర్ఎస్కు జైకొట్టిన పల్లెపహాడ్వాసులు
- సర్పంచ్‌తో సహా 200మంది టీఆర్ఎస్లో చేరిక
- కడుపులో పెట్టి కాపాడుకుంటామన్న మంత్రి హరీశ్‌రావు
తొగుట : ముంపు గ్రామమైన తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామస్తులు టీఆర్ఎస్కు జై కొట్టారు. బీజేపీ కంచుకోటగా ఉన్న పల్లెపహాడ్ గ్రామం మొత్తం టీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. మంగళవారం తొగుట మాజీ జడ్పీటీసీ గుడూరి లక్ష్మి రాములు ఆధ్వర్యంలో పల్లెపహాడ్ సర్పంచ్ గుగ్లోతు చిన్న రజిత, మాజీ సర్పంచ్ కీసర సంతోష మల్లేశంతో పాటు పలువురు వార్డు సభ్యులు, 200మంది గ్రామస్తులు బీజేపీ నుంచి మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో సిద్దిపేటలోని ఆయన స్వగృహంలో టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పడంతో నమ్మి టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరామని, ఎన్నికలయ్యాక ఇంత వరకు వారి జాడ కనిపించలేదని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తమ కష్టాలు తీరుతాయని, ఎన్నికలప్పుడు వచ్చి మాయమయ్యే పార్టీలతో ఏమి కాదని గ్రామస్తులు తేల్చి చెప్పారు.
కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం : మంత్రి
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాల ప్రజల త్యాగాలు మరువలేనివని, వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. పల్లెపహాడ్ గ్రామస్తులు టీఆర్ఎస్లో చేరడం సంతోషకరమన్నారు. మల్లన్నసాగర్ నిర్మిస్తున్న సందర్భంలో మిగతా గ్రామాలు ముందుకు రాని సమయంలో పల్లెపహాడ్ గ్రామస్తులు ముందుకు వచ్చి మొదటి సంతకం చేశారని, నేడు టీఆర్ఎస్ పార్టీకి జైకొడుతూ సీఎం కేసీఆర్‌పై ఉన్న అచంచల విశ్వాసం ఉంచుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముంపు గ్రామాల ప్రజలకు పరిహారంతో పాటు పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంలో విశాలమైన స్థలంలో, సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. కాలనీ సమీపంలో ఆహార శుద్ధి పరిశ్రమలు, రూ.200 కోట్లతో కోకాకోలా కంపెనీతో పాటు కావేరి, ప్రసాద్ సీడ్స్ తదితర కంపెనీలు నెలకొల్పుతున్నట్లు చెప్పారు. వాటిలో ముంపు గ్రామాల యువతకు ప్రాధాన్యమిస్తారన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తామన్నారు. ఎన్నికలప్పుడే వచ్చిపోయే పార్టీలను దుబ్బాక ప్రజలు గమనిస్తున్నారని, ఉప ఎన్నికల్లో వారికి కాల్చి, వాత పెట్టడం ఖాయమన్నారు. పల్లెపహాడ్తో పాటు మల్లన్న సాగర్ గ్రామల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు నర్పింహులు, ఎంపీటీసీలు స్వామి, శరత్, సర్పంచ్‌లు ఎల్లం, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్‌లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..
- డబ్ల్యూటీసీ ఫైనల్ లార్డ్స్‌లో కాదు.. సౌథాంప్టన్‌లో..
- గురుద్వారాలో ఉచిత డయాలసిస్ కేంద్రం.. ఎక్కడంటే!
- సరిహద్దులో భారత సైన్యం ఆటా-పాటా
- అన్ని సార్లూ అన్నం మంచిది కాదట!