శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 05, 2020 , 01:54:43

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం

  • n బ్యాగరి నర్సింహులు కుటుంబానికి రూ.2లక్షలు 
  • n కూతురు సుస్మితకు ఉద్యోగం.. వర్గల్‌ ఎంపీడీవో కార్యాలయంలో  విధుల్లో చేరిన సుస్మిత 
  • n త్వరలో ఎకరం భూమి కూడా ఇస్తాం
  • n రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవీ రవీందర్‌

గజ్వేల్‌ అర్బన్‌: ఆత్మహత్య చేసుకుని మృ తిచెందిన వర్గల్‌ మండలం వేలూరు గ్రామానికి చెందిన బ్యాగరి నర్సింహులు కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని విధాలా ఆదుకుంటున్నామని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దేవీరవీందర్‌ అన్నారు. శుక్రవారం బ్యాగరి నర్సింహులు కూతురు సుస్మిత ఉద్యోగం కోసం ఆదేశాలు జారీ కాగా, ఎంపీడీవో కార్యాలయంలో విధు ల్లో చేరింది. అనంతరం రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దేవీరవీందర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన మాట ప్రకారం బ్యాగరి నర్సింహులు కుటుంబానికి గతంలో రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశామని, ఇప్పుడు నర్సింహులు కూతురు సుస్మితకు ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఆమె విధుల్లో కూడా చేరిందన్నారు. త్వరలో కుటుంబానికి ఎకరం భూమి కూడా అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ మామిండ్ల బాలమల్లు యాదవ్‌, ఎం పీపీ జాలిగామ లత రమేశ్‌, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చిప్పల యాదగిరి, అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo