శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 15, 2020 , 00:27:18

కరోనా విజేతలు ముందుకు రావాలి

కరోనా విజేతలు ముందుకు రావాలి

  • n ప్లాస్మా దానం చేసి, ప్రాణాలను కాపాడాలి
  • n కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టు, ఐసీఎంఆర్‌ ప్రశంసలు
  • n కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ తొలి అనుమతి సిద్దిపేట వైద్య కళాశాలకే..
  • n రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 
  • n సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో ఆర్టీపీసీఆర్‌ కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌, మొబైల్‌ కొవిడ్‌ టెస్టింగ్‌ బస్సు ప్రారంభం 

సిద్దిపేట కలెక్టరేట్‌ : కరోనా విజేతలు ముందుకు రావాలని, ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో కొవిడ్‌ టెస్టింగ్‌(ఆర్టీపీసీఆర్‌) ల్యాబ్‌, మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో కొవిడ్‌ మొబైల్‌ టెస్టిం గ్‌ బస్సును జడ్పీ అ ధ్యక్షురాలు రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు వేగంగా చేసి, వెం టనే ఫలితాలు ప్రకటించేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో కొవి డ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇంతకు ముందు కొవిడ్‌ నిర్ధారణ కోసం శాంపిల్స్‌ స్థానికంగా సేకరించి, హైదరాబాద్‌ పంపే వారని, ఫలితాల కోసం రెండు నుంచి మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చేదన్నారు.ఇక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఒకే రోజులో ఫలితాలు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ప్రభుత్వ వైద్య కళాశాల, గజ్వేల్‌ ఆర్వీఎం ద వాఖానల్లో కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభు త్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రజ లు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారు సిద్దిపేట, గజ్వేల్‌ ఆర్వీఎం దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్‌ బాధితుల్ల్లో 80 నుంచి 90 శాతం మంది ఐసొలేషన్‌లో ఉండి, కరోనాను జయిస్తున్నారని, మిగతా 10మంది మాత్రమే దవాఖానలో ఉండి చికిత్స తీసుకోవాల్సి వస్తున్నదన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల హోమ్‌ కిట్స్‌ ప్రభుత్వం అందించిందన్నారు. 

 తొలి అనుమతి సిద్దిపేట వైద్య కళాశాలకే.. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటైన వైద్య కళాశాలల్లో భాగంగా కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌కు సంబంధించిన తొలి అనుమతి మన సిద్దిపేటకు వచ్చిందన్నారు. వైద్య కళాశాలలకు ఇలాంటి అనుమతులు రావాలంటే సాధారణంగా మూడేండ్ల సమయం పడుతుందన్నారు. సీ ఎం ఆశీస్సులు, ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ ల్యాబ్‌ ద్వారా ప్రతి 8 గంటలకు ఫలితం వస్తుందన్నారు. షిప్టుకు 96 చొప్పున రెండు షిప్టులు నడిపి రోజుకు కనీసం 200 మందికి ఫలితాలు వచ్చేలా చూస్తామన్నారు. సిద్దిపేట తో పాటు గజ్వేల్‌ ఆర్వీఎంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ టెస్టిం గ్‌ ల్యాబ్‌ల ద్వారా ఒక రోజుకు 550 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం చేకూరిందని, రాబోయే రోజుల్లో ఆర్‌ఎన్‌ఏ-డిజిటల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ మెషిన్‌ జిల్లాకు తెప్పిస్తామని, తద్వారా రోజుకు 600 మందికి పరీక్షలు చేసే సౌలభ్యం చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 కేం ద్రాల్లో ర్యాపిడ్‌ కిట్‌ల ద్వారా ప్రతి రోజు వెయ్యికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సిద్దిపేట పట్టణం లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్న కంటోన్మెంట్‌ ఏరియాలో మొదట మొబైల్‌ టెస్టింగ్‌ బస్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. తదనంతరం గల్లీలోకి పంపుతామ ని, పరీక్షలు చేసి వ్యాధి వ్యాప్తించకుండా చూస్తామన్నారు. కరోనా పోరాటంలో ముందుండి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వైద్యులను మంత్రి  సన్మానించారు.కరోనాపై సోషల్‌మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు.  

 హైకోర్టు, ఐసీఎంఆర్‌ ప్రశంసలు 

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న చికిత్సలను రాష్ట్ర హైకోర్టు, ఐసీఎంఆర్‌ ప్రశంసించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అద్భుతంగా పని చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు, ఐసీఎంఆర్‌ అభినందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి తెలిపా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ తమిళ అరస్‌, జిల్లా వైద్యాధికారి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

62మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు 

సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గంలోని 62 మందికి రూ.15లక్షల 33 వేల 500 సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. చెక్కులను లబ్ధిదారు లు వెంటనే తమ ఖాతాలో జమ చేసుకోవాలని మంత్రి సూచించారు. పట్టణానికి చెందిన 12 మందికి రూ.3.04లక్షలు, రూరల్‌ మండలానికి చెందిన ఐదుగురికి రూ.1.33లక్షలు, సిద్దిపేట అర్బన్‌ మండలంలోని 10 మందికి రూ.2. 64 లక్షలు, చిన్నకోడూరు మండలంలోని 19మందికి రూ.4.10 లక్షలు, నంగునూరు మండలంలోని 8 మందికి రూ.2.04లక్షలు, నారాయణరావుపేట మండలంలోని 8 మందికి రూ.2. 11లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo