శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 24, 2020 , 04:51:38

27న చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

27న చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక
  • - ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం
  • - తొలుత ప్రమాణం, అనంతరం ఎన్నిక
  • - షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ
  • - రేపు ఓట్ల లెక్కింపు..అన్ని ఏర్పాట్లు పూర్తి
  • -కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు
  • -402 మంది పోలీసులతో పర్యవేక్షణ
  • -కౌంటింగ్‌ కే్ంరద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌

 సిద్దిపేట టౌన్‌ : ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ పేర్కొ న్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సీపీ మాట్లాడారు. జిల్లాలోని గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాలలో ఈ నెల 25న కౌంటింగ్‌ పురస్కరించుకొని 402 మంది పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌నకు సంబంధించిన కౌంటింగ్‌ను గజ్వేల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, హుస్నాబాద్‌ ఎన్నికల కౌంటింగ్‌ను తెలంగాణ మోడల్‌ స్కూల్‌, దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌ను లచ్చపేట తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో, చేర్యాల కౌంటింగ్‌ తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలో జరుగుతాయన్నారు.

 402 మంది పోలీసులతో బందోబస్తు

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు 402 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఏసీపీలు నలుగురు, సీఐలు 10, ఎస్‌ఐలు 20, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు 32, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు 250, హోంగార్డులు, మహిళా హోంగార్డులు 40, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ అధికారులు, సిబ్బంది 40, ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద యాక్సెస్‌ కంట్రోల్‌ రూమ్‌ పెడుతున్నామని తెలిపారు. దీని ద్వారా బాంబుస్కాడ్‌ సిబ్బంది అధికారులను, ప్రజాప్రతినిధులను తనిఖీ చేసి లోనికి పంపిస్తామని వివరించారు.

 402 మంది ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణలో భాగస్వాములు అవుతారని చెప్పారు. ప్రత్యేకంగా ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే పార్కింగ్‌ చేయాలని, ఎవరిని ఇబ్బంది పెట్టవద్దన్నారు. 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు కమిషనరేట్‌లోని గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఆయా పట్టణాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ వివరించారు.

 ప్రజాప్రతినిధులకు సూచనలు

కౌంటింగ్‌ రోజున సెంటర్లతో పాటు చుట్టు పక్కల 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది గుంపుగుంపులుగా తిరగవద్దు. కౌంటింగ్‌, ఎన్నికల ఏజెంట్లు పోటీ చేసిన కౌన్సిలర్లు పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్లకు అనుమతి లేదు. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద చుట్టుపక్కల 500 మీటర్ల దూరంలో, పట్టణాల్లో 144 సెక్షన్‌ అమలవుతుంది. పార్టీ జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించడం, ప్రదర్శనకు అనుమతి లేదు. మైక్‌లు, లౌడ్‌ స్పీకర్లు, పాటలు, ఉపన్యాసాలు కేంద్రాల వద్ద నిషేధం. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు కౌంటింగ్‌ అనంతరం నిర్వహించకూడదన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊ రేగింపులు, పటాకులు కాల్చడం వంటివి నేరంగా పరిగణిస్తా మని సీపీ జోయల్‌ డెవిస్‌ హెచ్చరించారు. పోలీసుల సూచనలు ఎవరు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజాప్రతినిధులు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ నిర్వహణకు పోలీసుల సలహాలు, సూచనలను పాటించి సహకరించాలని కోరారు.


logo