Xiaomi | MIUIకి గుడ్‌బై చెప్పేసిన షావోమి.. ఇకపై HyperOS
Xiaomi | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ (Xiaomi ) కీలక ప్రకటన చేసింది. ఏళ్ల తరబడి షావోమి ఫోన్లలో వాడుతున్న ‘ఎంఐయూఐ’ (MIUI) ఆపరేటింగ్ సిస్టమ్‌కు గుడ్‌బై చెప్పేసింది.
Xiaomi | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ (Xiaomi ) కీలక ప్రకటన చేసింది. ఏళ్ల తరబడి షావోమి ఫోన్లలో వాడుతున్న ‘ఎంఐయూఐ’ (MIUI) ఆపరేటింగ్ సిస్టమ్‌కు గుడ్‌బై చెప్పేసింది. దాని స్థానంలో కొత్త ఓఎస్ (New OS)ను తీసుకొస్తున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది.
షావోమి స్మార్ట్‌ఫోన్స్ వాడే వారందరికీ ‘ఎంఐయూఐ’ సుపరిచితమే. ఈ మొబైల్స్‌లో MIUI ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎంఐయూఐ సాఫ్ట్వేర్ బ్రాండ్‌కి ఓ పర్యాయపదంగా మారింది. ఎంఐ, రెడ్మీ ఫోన్లతో పాటు పోకో ఫోన్లలో కూడా ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. షావోమి ఎంఐయూఐకి ఓ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ప్రజాదరణ పొందిన ఎంఐయూకి తాజాగా సంస్థ గుడ్‌బై (goodbye to MIUI) చెప్పేసింది.
దాదాపు 13 ఏళ్లుగా ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌ని షావోమి తన మొబైల్స్‌కి వాడుతూ వస్తోంది. అయితే, తాజాగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని పక్కన పెట్టేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ (Xiaomi CEO Lei Jun ) తాజాగా వెల్లడించారు. త్వరలో తీసుకురాబోయే షావోమి 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో హైపర్ ఓఎస్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఓఎస్ సిస్టమ్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో కూడా హైపర్ ఓఎస్ ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
Today marks a historic moment. After years of collective work, our new operating system, #XiaomiHyperOS, is set to make its official debut on #Xiaomi14Series. pic.twitter.com/bNJqIyD8y0
— Lei Jun (@leijun) October 17, 2023
Also Read..
LinkedIn Layoff | రెండో రౌండ్ లేఆఫ్స్ ప్రకటించిన లింక్డిన్.. ఈ సారి ఎంతమంది ఉద్యోగులంటే..?
Samantha | 14 నెలల తర్వాత.. తనకు ఇష్టమైన ఫుడ్ తిన్న సమంత
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

