Shashi Tharoor | ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎంపికపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నుంచి ఆ ఇద్దరు..
Shashi Tharoor | 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Shashi Tharoor | 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేదా, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని నామినేట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా దేశంలోని 28 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆయా పార్టీలన్నీ ‘ఇండియా’ (INDIA) పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఇందులో కాంగ్రెస్ తో పాటు జనతాదళ్, ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ సహా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్‌ను ఎలాగైనా గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని మట్టికరిపించి కేంద్రంలో విపక్షాల కూటమి ‘ఇండియా’ అధికారంలోకి వచ్చే అకవాశాలు ఉన్నాయని శశిథరూర్ అన్నారు.
‘2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక పార్టీ కాదు. అందుకని ఫలితం వెలువడిన తర్వాత కూటమిలోని అన్ని పార్టీల నాయకులు కలిసి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. ‘ఇండియా’ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా.. కూటమిలోని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే లేదా, రాహుల్ గాంధీలో ఎవరో ఒకరిని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందని నేను భావిస్తున్నాను’ అని థరూర్ వివరించారు. ఇక ప్రధానిగా ఖర్గేకి అవకాశం ఇస్తే దేశానికి తొలి దళిత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టిస్తారని అన్నారు. ఖర్గే వైపు మొగ్గుచూపడానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తుందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కావడంతో రాహుల్ గాంధీని ప్రధానిని చేసే అవకాశం లేకపోలేదని శశి థరూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read..
LinkedIn Layoff | రెండో రౌండ్ లేఆఫ్స్ ప్రకటించిన లింక్డిన్.. ఈ సారి ఎంతమంది ఉద్యోగులంటే..?
Samantha | 14 నెలల తర్వాత.. తనకు ఇష్టమైన ఫుడ్ తిన్న సమంత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

