Emergency Landing | అడల్ట్ డైపర్‌ను బాంబుగా పొరబడిన ఫ్లైట్ సిబ్బంది.. గంట ప్రయాణం తర్వాత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Emergency Landing | ఫ్లైట్ టాయిలెట్లో కనిపించిన అడల్ట్ డైపర్ (Adult Diaper) సిబ్బందిని, ప్రయాణికులను కాసేపు గందరగోళానికి గురి చేసింది. దాన్ని ఫ్లైట్ సిబ్బంది బాంబు (Bomb)గా భావించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Emergency Landing | ఫ్లైట్ టాయిలెట్లో కనిపించిన అడల్ట్ డైపర్ (Adult Diaper) సిబ్బందిని, ప్రయాణికులను కాసేపు గందరగోళానికి గురి చేసింది. దాన్ని ఫ్లైట్ సిబ్బంది బాంబు (Bomb)గా భావించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో గంట పాటు గాల్లో ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి అత్యవసరంగా కిందకి దించేలా (Emergency Landing) చేసింది. ఈ ఘటన కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Copa Airlines flight)లో గత శుక్రవారం చోటు చేసుకుంది.
విమానం పనామా సిటీ (Panama City)లోని టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tocumen International Airport ) నుంచి టంపా (Tampa) మీదుగా ఫ్లోరిడా (Florida)కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత ఫ్లైట్ టాయిలెట్లో అనారోగ్య సమస్యల కారణంగా పెద్దవాళ్లు వేసుకునే డైపర్‌ను సిబ్బంది గుర్తించారు. అది అనుమానాస్పదంగా ఉండటంతో బాంబుగా భావించి.. పై అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని తిరిగి పనామాకు మళ్లించారు.
విమానం పనామా టోకుమెన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే.. బాంబ్ స్క్వాడ్ గాలింపు చేపట్టింది. ఫ్లైట్‌లో ఉన్న మొత్తం 144 మంది ప్రయాణికుల్ని కిందకు దింపి.. విమానంలో అనువనువునా గాలించింది. టాయిలెట్‌లోని అనుమానాస్పద వస్తువును అడల్ట్ డైపర్‌గా గుర్తించింది. విమానంలో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్ధారించింది. అనంతరం విమాన ప్రయాణానికి అనుమతించింది. దీంతో ఆ విమానం ఆలస్యంగా ఫ్లోరిడాకు బయలుదేరింది. ఈ ఘటనతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
Luego de una alerta por el @aacivilpty, de un objeto extraño en una aerolínea las unidades de Fuerzas Especiales activaron el protocolo de emergencia y al ser verificado resultó ser un pañal desechable de adulto. #Prevención pic.twitter.com/n3pBqQZki9
— Policía Nacional (@ProtegeryServir) October 13, 2023
Also Read..
World Cup 2023 | మ్యాచ్ మధ్యలో స్టేడియంలో కూలిన హోర్డింగ్.. వీడియో వైరల్
Allu Arjun | చిన్నారి అభిమానితో అల్లు అర్జున్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
Samantha | 14 నెలల తర్వాత.. తనకు ఇష్టమైన ఫుడ్ తిన్న సమంత
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

