Bride Flees | పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!
Bride Flees | పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ యువకుడికి నాలుగు రోజులకే ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టిన భార్య ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది.
Bride Flees | పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ యువకుడికి నాలుగు రోజులకే ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టిన భార్య ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఆమె కోసం వెతికితే ఆచూకీ లేదు.. ఇంట్లోని సేఫ్ తెరిచి చూస్తే లక్షల విలువైన నగలు, నగదు కూడా మాయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బాధితుల ఫిర్యాదు ప్రకారం.. హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 22 ఏళ్ల యువతితో బిలాస్పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి వివాహం జరిగింది. అక్టోబర్ 31న హర్యానాలోని జగాధ్రి సివిల్ కోర్టులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వధువు భర్తతో కలిసి అత్తింటికి వెళ్లింది. కొత్త కోడలు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పెళ్లయిన నాలుగు రోజులకే అంటే నవంబర్ 4న వధువు ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో వధువు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును తీసుకుని వెళ్లిపోయినట్లు వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంట్లోని సేఫ్‌లో ఉంచిన సుమారు రూ.16 లక్షల విలువైన నగలు, రూ.1.80 లక్షల నగదు కనిపించలేదు. మొత్తం రూ.17.80 లక్షల విలువైన సొత్తు మాయమైంది. వధువు కనిపించకపోవడంతో పాటు నగలు, నగదు కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తొలుత బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. అయినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో వరుడి సోదరి భరారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో భరారీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై బిలాస్పూర్ ఎస్పీ అభిషేక్ ధిమాన్ స్పందించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, కనిపించకుండా పోయిన యువతి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని విషయాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bride Flees | పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!
Renu Desai | దీపావళి అయిపోయినా అర్ధరాత్రి పేల్చడం ఏంటి.. ‘ఇతరులను హింసించకండి’ అంటూ రేణూ ఘాటు వ్యాఖ్యలు!
Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
Rishikanth | రామ్ చరణ్ ‘ఆర్సీ17’ మూవీలో నేను లేను.. రూమర్స్‌కు చెక్ పెట్టిన తమిళ నటుడు!
IND vs NZ | టాస్ తర్వాత కూడా వరుణుడి ఆట.. చివరకు రద్దయిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

