Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
Medchal | మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఓ నగల దుకాణంలో చోరీ జరగడం కలకలం రేపింది. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
Medchal | మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఓ నగల దుకాణంలో చోరీ జరగడం కలకలం రేపింది. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరిచిన తర్వాతే ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే దుకాణంలో గతంలోనూ చోరీ జరగడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో దుకాణం వెనుక భాగంలోని గది గోడకు రంధ్రం చేశారు. అందులో నుంచి లోపలికి ప్రవేశించి దుకాణంలో ఉన్న వెండి వస్తువులను అపహరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోజూ మాదిరిగానే ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని శేషమాల్ చౌదరి కుమారుడు అజయ్ చౌదరి.. లోపల పరిస్థితిని చూసి అవాక్కయ్యాడు. దుకాణం వెనుక గోడకు రంధ్రం ఉండటం, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండోసారి చోరీ!
శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌లో చోరీ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలోనూ ఇదే దుకాణంలో చోరీ జరగ్గా.. ఇప్పుడు మరోసారి వెనుక గోడకు రంధ్రం చేసి దుండగులు చోరీకి పాల్పడటంతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా చోరీపై బాధితుల ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుకాణాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులు ఎలా వచ్చారు? ఎంత మొత్తంలో వెండి వస్తువులు అపహరించారు? ఈ చోరీ వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
Bride Flees | పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!
Renu Desai | దీపావళి అయిపోయినా అర్ధరాత్రి పేల్చడం ఏంటి.. ‘ఇతరులను హింసించకండి’ అంటూ రేణూ ఘాటు వ్యాఖ్యలు!
Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

