Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
క్షణాల్లో ఎన్నో పోషకాలు అందించే సప్లిమెంట్లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ ఆరోగ్య, పోషకాహార రంగంలోకి అడుగుపెడుతూ ప్రోటోకాల్32 పేరుతో కొత్త సప్లిమెంట్‌ను ప్రారంభించారు. ఇందులో 32 రకాల పోషక పదార్థాలను ఒకే 8.5 గ్రాముల సాచెట్లో అందిస్తున్నారు. రోజుకు ఒకసారి నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చని సంస్థ తెలిపింది.
Protocol 32 | క్షణాల్లో ఎన్నో పోషకాలు అందించే సప్లిమెంట్లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ ఆరోగ్య, పోషకాహార రంగంలోకి అడుగుపెడుతూ ప్రోటోకాల్32 పేరుతో కొత్త సప్లిమెంట్‌ను ప్రారంభించారు. ఇందులో 32 రకాల పోషక పదార్థాలను ఒకే 8.5 గ్రాముల సాచెట్లో అందిస్తున్నారు. రోజుకు ఒకసారి నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. వేర్వేరు పోషక పదార్థాల కోసం అనేక సీసాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క సాచెట్‌తో సప్లిమెంట్ల వాడకాన్ని సులభతరం చేయాలన్నది దీని ఉద్దేశం. శక్తి, మెదడు పనితీరు, ఒత్తిడి, నిద్ర, చర్మం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, కీళ్లు, కంటి ఆరోగ్యం, గుండె, రక్తనాళాలు, కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుందని సంస్థ ప్రచారం చేస్తోంది.
ఏమేం పోషకాలు ఉంటాయి..
ఈ సప్లిమెంట్లో క్రియేటిన్, గ్లైసిన్, ఎన్-ఎసిటైల్ సిస్టీన్, మెగ్నిషియం, కోఎంజైమ్ క్యూ10, ఒమెగా-3 కొవ్వు ఆమ్లమైన డీహెచ్ఏ, విటమిన్లు సి, డి3, ఈ, బి6, బి2, బి12, ఫోలిక్ యాసిడ్, జింక్, కాపర్ వంటి పదార్థాలు ఉన్నాయి. వీటితోపాటు అశ్వగంధ, పసుపులోని కర్కుమిన్, బోస్వెల్లియా, మిల్క్ థసిల్, అమెరికన్ జిన్సెంగ్, బ్రాహ్మి, అల్లం, కుంకుమపువ్వు వంటి మూలికా పదార్థాలను కూడా చేర్చారు. అకేషియా పీచు, సన్‌ఫ్లవర్ లెసిథిన్, ఎల్-థియానిన్, ల్యూటిన్, జియాక్సాంథిన్, జీర్ణ ఎంజైములు, ప్రోబయోటిక్స్, ఆస్టాక్సాంథిన్ కూడా ఇందులో ఉన్నాయి. కండరాల శక్తి, నాడీ వ్యవస్థ పనితీరు, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం వంటి వివిధ శరీర విధుల్లో ఈ పోషకాలకు పాత్ర ఉంది. అయితే, ప్రతి పదార్థం వల్ల కలిగే ప్రయోజనం దాని మోతాదు, శరీరం దానిని ఎంతవరకు గ్రహిస్తుంది, వ్యక్తికి ఆ పోషకం అవసరమా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యంపై ప్రభావం ఎంత..
అయితే, ఒకే సప్లిమెంట్లో 32 పదార్థాలు ఉన్నంత మాత్రాన అవన్నీ ఆశించిన ప్రయోజనాలను అందిస్తాయని చెప్పలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉత్పత్తి ప్రచారం చేస్తున్న అన్ని ఆరోగ్య ప్రయోజనాలకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. ఉదాహరణకు.. క్రియేటిన్ కండరాల బలం, వ్యాయామ సామర్థ్యానికి తోడ్పడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అశ్వగంధ ఒత్తిడి, నిద్రకు ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచించినప్పటికీ, దాని ప్రభావాలపై మరింత పరిశోధన అవసరం. కొన్ని మూలికా పదార్థాలు మందులతో ప్రతికూల ప్రభావాలు కలిగిస్తాయి. ఒకేసారి అనేక పదార్థాలను తీసుకుంటే ఏదైనా దుష్ప్రభావం వచ్చినప్పుడు దానికి కారణం ఏదో గుర్తించడం కూడా కష్టమవుతుంది.
వైద్యుల సలహా తప్పనిసరి..
సప్లిమెంట్ తీసుకునే ముందు ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, వాడుతున్న మందులు, అవసరమైన వైద్య పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే మల్టీవిటమిన్లు లేదా ఇతర పోషక ట్యాబ్లెట్లను వాడేవారు ఒకే పదార్థం రెండుసార్లు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. విటమిన్ బి6 అధిక మోతాదులో ఎక్కువకాలం తీసుకుంటే నరాలకు హాని కలగుతుంది. జింక్ అధికంగా తీసుకోవడం వల్ల రాగి శోషణకు ఆటంకం కలుగుతుంది. కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారు వైద్యుల సలహా లేకుండా ఇటువంటి సప్లిమెంట్లు వాడకూడదు. పోషకాహారం, తగిన నిద్ర, వ్యాయామం, వైద్య చికిత్సకు ఇవి ప్రత్యామ్నాయం కావని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
Ram Charan | ‘ఇట్లు అర్జున’ ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. ‘కాకా’ మూవీపై బిగ్ అప్డేట్!
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
Bride Flees | పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

