Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70 | వివో ఎక్స్70 సిరీస్ మోడల్ ఫోన్లలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది

వచ్చే నెలలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్‌కు వివో స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరిస్తోంది. దీంతో ఐపీఎల్ వేడుకలు ప్రారంభం కాగానే.. వివో ఎక్స్70 సిరీస్ మోడల్ ఫోన్లలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. ఇదివరకే వివో ఎక్స్ 60 సిరీస్‌ను రిలీజ్ చేసింది.

తాజాగా ఐపీఎల్ పార్టనర్షిప్తో వివో ఎక్స్70 సిరీస్‌ను లాంచ్ చేయాలని వివో ప్లాన్ చేస్తోంది. వివో ఎక్స్70 సిరీస్‌లో భాగంగా.. వివో ఎక్స్70, వివో ఎక్స్70 ప్రో, వివో ఎక్స్70 ప్రో ప్లస్ ఫోన్లను విడుదల చేయనుంది.

ఈ సిరీస్ తర్వాత వివో ఎక్స్70టీ, వివో ఎక్స్70టీ ప్రో సిరీస్ ఫోన్లను వివో విడుదల చేయనుంది. అయితే.. విడుదలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా వివో ప్రకటించకముందే.. ఫోన్ మోడల్స్, ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వివో ఎక్స్ 70 సిరీస్ ఫోన్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

వివో ఎక్స్ 70 సిరీస్‌లో 6.56 ఇంచ్ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, మీడియాటెక్ డైమెన్షిటీ 1200 ప్రాసెసర్, 40 ఎంపీ రేర్ కెమెరా, 12 ఎంపీ సెకండరీ, 13 ఎంపీ టెర్షియరీ కెమెరా, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లలో వివో ఎక్స్ 70 సిరీస్ ఫోన్లు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అయితే.. 70 ప్రో, 70 ప్రో ప్లస్ ఫోన్లలో కెమెరా మెగాపిక్సెల్స్ను పెంచే చాన్స్ ఉండొచ్చు. అలాగే.. ఎక్కువ ఎంఏహెచ్ ఉన్న బ్యాటరీలను ఇందులో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Mi TV 5X : ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్ రిలీజ్.. ధర ఎంతంటే?
Samsung M32 5G : ఆకర్షణీయమైన ఫీచర్లతో సామ్సంగ్ ఎమ్32 5జీ రిలీజ్.. ధర ఎంతంటే?
Mi 11T: హైఎండ్ ఫీచర్లు ఉండే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కావాలా? అయితే.. సెప్టెంబర్ 15 దాకా వెయిట్ చేయండి
Oppo A15 : జియోతో చేతులు కలిపిన ఒప్పో బ్రాండ్.. తక్కువ ధరకే ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

