Oppo F19S : బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో ఒప్పో ఎఫ్19ఎస్ ఫోన్.. ధర, రిలీజ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇవే
చాలామందికి సరికొత్త ఫీచర్లతో, మంచి లుక్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడాలని ఉంటుంది. కానీ.. వేలకు వేలు పెట్టి స్మార్ట్‌ఫోన్‌ను కొనలేరు. అటువంటి వాళ్ల కోసం బడ్జెట్ ధరలో చాలా బ్రాండ్స్.. బెస్ట్ ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటి వరకు అటువంటి ఫోన్లు కూడా చాలానే మార్కెట్లోకి వచ్చాయి.

అలాంటి బ్రాండ్లలో ఒప్పో ఒకటి. ఒప్పో త్వరలో ఎఫ్19ఎస్ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. నిజానికి.. ఒప్పో ఇప్పటికే ఎఫ్19 సిరీస్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఎఫ్19 సిరీస్‌లో భాగంగా.. ఒప్పో ఎఫ్19, ఒప్పో ఎఫ్19 ప్రో, ఒప్పో ఎఫ్19 ప్రోప్లస్ ఫోన్లను విడుదల చేసింది. గత మార్చిలోనే ఎఫ్19 సిరీస్‌ను ఒప్పో లాంచ్ చేసింది. ఇవి ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్‌తో అనుసంధానం అయ్యాయి.
అయితే.. అదే ఎఫ్19 సిరీస్‌లో సరికొత్త ఫీచర్లతో ఒప్పో ఎఫ్19ఎస్ అనే మోడల్ ఫోన్‌ను ఒప్పో త్వరలో విడుదల చేయనుంది. దీని ధర కూడా 18 వేల రూపాయలే ఉండనుందట. బడ్జెట్ ధరలో ఇప్పటికే రిలీజ్ అయిన ఒప్పో ఎఫ్19 సిరీస్‌లో లేని ఫీచర్లను ఇందులో యాడ్ చేసి కస్టమర్లకు అందించాలనేది ఒప్పో ప్లాన్.

ఒప్పో ఎఫ్19ఎస్ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11 తో రన్ అవుతుంది. 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లే, 20:9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో, స్నాప్‌డ్రాగన్ 662 ఎస్వోసీ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 48 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో రానుంది. ఈ ఫోన్‌ను వచ్చే ఫెస్టివల్ సీజన్లో విడుదల చేసేందుకు ఒప్పో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

