వన్‌ప్లస్ 9 సిరీస్‌లో ఇప్పటికే మూడు స్మార్ట్ఫోన్లను వన్‌ప్లస్ రిలీజ్ చేసింది. ఇప్పటికే వన్‌ప్లస్ 9ఆర్ కూడా రిలీజ్ అయింది. అయితే.. సరికొత్త ఫీచర్లతో.. వన్‌ప్లస్.. 9ఆర్టీని రిలీజ్ చేయనుంది.
అక్టోబర్‌లో వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌ను చైనా, ఇండియాలో రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 9ఆర్టీ.. 9ఆర్ మోడల్‌కు అప్‌గ్రేడ్ వర్షన్లా ఉంటుందని తెలుస్తోంది. 9ఆర్టీ మోడల్‌ను పరిమిత సంఖ్యలో ఇండియా, చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మోడల్‌తో పాటు.. రెండు మూడు నోర్డ్ మోడల్స్‌ను కూడా వన్‌ప్లస్ త్వరలో లాంచ్ చేయనుంది. అయితే.. ఈసంవత్సరంలో వన్‌ప్లస్.. 9 సిరీస్ ఫోన్లనే ఎక్కువగా రిలీజ్ చేసింది. 9, 9 ప్రో మోడల్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి.
వన్‌ప్లస్ 9ఆర్టీ ఫోన్ కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లతో రానున్నట్టు తెలుస్తోంది. 120 హెచ్‌జెడ్ హై రీఫ్రెష్ రేట్ ఏఎంవో ఎల్ఈడీ పానెల్, స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్766 సెన్సార్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 లాంటి ఫీచర్లతో వన్‌ప్లస్ 9ఆర్టీ రిలీజ్ కానుంది.
వన్‌ప్లస్ 9ఆర్టీ ప్రైస్ మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు. అయితే.. వన్‌ప్లస్ 9ఆర్ బేస్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.39,999గా ఉంది. వన్‌ప్లస్ 9ఆర్టీ ధర.. 45 వేల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు.