న్యూఢిల్లీ : టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ (Layoffs) కలకలం కొనసాగుతోంది. లేటెస్ట్గా ఆన్లైన్ ఎడ్యుటెక్ కంపెనీ అప్‌గ్రాడ్ తన సబ్సిడరీ క్యాంపస్ నుంచి 30 శాతం సిబ్బందిని తొలగించింది. 2021 మార్చిలో క్యాంపస్‌ను అప్‌గ్రాడ్ కొనుగోలు చేసింది. 2022 డిసెంబర్లో సబ్సిడరీ హరప్పా ఎడ్యుకేషన్‌లో 70 శాతం మందిని తొలగించిన అప్‌గ్రాడ్ తాజాగా క్యాంపస్‌లో రెండో విడత లేఆఫ్స్‌కు పూనుకుంది.
మాస్లేఆఫ్స్ టెకీలను వణికిస్తున్న క్రమంలో స్టార్టప్స్‌లో వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి నిధుల కొరతతో లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నాయని స్టార్టప్ కవరింగ్ పోర్టల్ ఎన్‌ట్రాకర్ విశ్లేషిస్తోంది. గత ఏడాది ఐటీ కంపెనీలతో పాటు ఎడ్యుటెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. మార్కెట్లో మందగమనం నెలకొనడంతో ఈ రంగంలో 18,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.
ఈ ఏడాది జనవరిలో ఎడ్యుటెక్ కంపెనీ అన్అకాడమీ నిర్వహించే రెలివెల్ 40 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఎడ్యుకేషన్ బిజినెస్‌ను పక్కనపెట్టి నెక్ట్స్లెవెల్ అనే న్యూ యాప్‌పై కసరత్తు సాగిస్తోంది. ఇక బైజూస్ తన ఇంజనీరింగ్ టీమ్స్‌లో 15 శాతం ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరో 1000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు బైజూస్ సిద్ధమైందనే వార్తలు గుబులురేపుతున్నాయి.
Read More :
layoffs | ఏఐ టూల్స్‌తో కొలువుల కోత : చాట్‌జీపీటీ ఎఫెక్ట్‌పై గుబులు
Meta Platforms: వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా