ప్రముఖ మెసేజింగ్, దేశీయ యాప్ టెలిగ్రామ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్ లో 1 బిలియన్ ఇన్ స్టాల్స్ మార్క్ ను క్రాస్ చేసింది. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అయితే.. ఈ మైలురాయిని టెలిగ్రామ్.. ఇటీవల ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం కలిగాక చేరుకోవడం గమనార్హం. ఫేస్ బుక్ సమస్య తర్వాత ఒక్కసారిగా టెలిగ్రామ్ కు 70 మిలియన్ల కొత్త యూజర్లు వచ్చారు. అంటే 7 కోట్ల మంది అన్నమాట. గత ఆగస్టులోనే ఈ యాప్ కు 1 బిలియన్ టోటల్ డౌన్ లోడ్స్ అయ్యాయి. దీంతో వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్, స్పోటిఫై, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద యాప్స్ సరసన టెలిగ్రామ్ కూడా చేరింది.
తాజాగా గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్స్ ఇన్ స్టాల్స్ కోటి దాటాయి. వాట్సప్ తర్వాత అత్యంత పాపులర్ అయిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్. అక్టోబర్ 4న ఫేస్ బుక్ సేవల్లో అంతరాయం కలిగాక.. టెలిగ్రామ్ యాప్ డౌన్ లోడ్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అక్టోబర్ 4నే టెలిగ్రామ్ కు 70 మిలియన్ల కొత్త యూజర్లు వచ్చారు. అలా.. టెలిగ్రామ్ వంద కోట్ల ఆండ్రాయిడ్ ఇన్ స్టాల్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Data Stealing : ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
మీరు లొడలొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోసమే ఈ యాప్స్
Six Pack : సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Free wifi : ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..