Free wifi : ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
Free wifi : డాటా అయిపోగానే ఇతరుల డాటాను వాడుకోవడంపై దృష్టిపెడుతున్నారు. ఈ ఉచిత వైఫై మన మొబైల్ ప్రైవసీని ఉల్లంఘింస్తుందన్న విషయం...

(Free wifi) ప్రస్తుతం ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు సర్ఫింగ్ చేసేందుకు వీలుగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకుంటున్నారు. డాటా అయిపోగానే ఇతరుల డాటాను వాడుకోవడంపై దృష్టిపెడుతున్నారు. ఈ ఉచిత వైఫై మన మొబైల్ ప్రైవసీని ఉల్లంఘింస్తుందన్న విషయం మాత్రం మనం తెలుసుకోవట్లేదు. వైఫైకి కనెక్ట్ అవగానే మొబైల్ డాటా వైఫై సర్వర్‌లో నిల్వ అవుతుంది. సైబర్ నేరస్థుడు ఇదే నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి.. సర్వర్‌ను హ్యాక్ చేసి మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం ఫ్రీ వైఫై ట్రెండ్‌లో ఉంది. రైల్వే, బస్సులు, హోటళ్లు, మాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద ఉచిత వైఫై సౌకర్యం అందిస్తున్నారు. అక్కడి నెట్‌వర్క్‌కు చేరుకుని ఉచితంగా ఇంటర్నెట్ ప్రయోజనాన్ని పొందుతున్నారు. అయితే, వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన వెంటనే వారి మొబైల్ డాటా మొత్తం వైఫై సర్వర్‌కు చేరుతుందన్న విషయం ప్రజలకు తెలియదు. దీని కారణంగా డాటా లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఉచిత వైఫై కొన్నిసార్లు లాస్ డీల్ అని నిరూపించవచ్చునంటున్నారు సైబర్ నిపుణుడు. ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లో చేరగానే మన మొబైల్లో సైనప్ సెట్టింగ్ సందేశం అందుతుంది. యెస్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మొబైల్ డాటా ఆటోమేటిక్‌గా సర్వర్‌కు కాపీ అవుతుంది.
మోసం ఎలా చేస్తారు..?
ఉచిత వైఫై కనెక్షన్ పొందిన తర్వాత, మొబైల్లో సైనప్ మెసేజ్ వస్తుంది. దీనిలో అవును అనే ఆప్షన్ బటన్‌పై క్లిక్ చేయగానే సర్వర్ మన మొబైల్ లొకేషన్, ఫొటో గ్యాలరీ, కెమెరా, కాంటాక్ట్ లిస్ట్, వీడియో గ్యాలరీ గురించి కూడా అడుగుతుంది. ఆ అన్ని ఆప్షన్లపై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మొబైల్ ఉచిత వైఫైకి కనెక్ట్ అవుతుంది. ఇలా జరిగేలోపే మన మొబైల్లోని డాటా మొత్తం వైఫై సర్వర్‌లో కాపీ అవుతుంది. దీని నుంచి బయటపడేందుకు ఉచిత వైఫైని తీసుకోకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో విశ్వసనీయ ప్రదేశాల నుంచిగానీ, వ్యక్తుల నుంచి గానీ అందుకోవాలి.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మొండిచెయ్యి.. ఇమ్రాన్ ప్రయత్నాలు వృధా
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
మొక్కలను ప్రేమించిన పల్లా వెంకన్న : వెంకయ్యనాయుడు
ఆ రోజు ఎవరికీ కనిపించకుండా పోతాను: సానియా మీర్జా.. ఏ రోజు.. ఎందుకు?
టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
హైతీలో అమెరికా మిషనరీలు కిడ్నాప్
పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

