Big Blow to Pak : పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మొండిచెయ్యి.. ఇమ్రాన్ ప్రయత్నాలు వృధా
Big Blow to Pak : పాకిస్తాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మొండిచెయ్యిచ్చింది. రుణం ఇచ్చేందుకు ససేమిరా అన్నది. రుణాలు తీసుకుంటూ...

(Big Blow to Pak) ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మొండిచెయ్యిచ్చింది. రుణం ఇచ్చేందుకు ససేమిరా అన్నది. రుణాలు తీసుకుంటూ వ్యవస్థను నడిపే ఫార్ములాపై పనిచేస్తున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని పాకిస్తాన్ చేసుకున్న విజ్ఞప్తిని ఐఎంఎఫ్ తోసిపుచ్చింది.
పాకిస్తాన్ వార్తాపత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం, అక్టోబర్ 4-15 తేదీల మధ్య జరిగిన చర్చలు అసమగ్రంగా ముగిశాయి. ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకునేందుకు విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచి ఆకర్శించేందుకు ప్రయత్నించినా.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాచిక పారలేదు. అంతమొత్తంలో రుణం ఇవ్వలేమని ఐఎంఎఫ్ కరాఖండిగా చెప్పేయడంతో.. ఇమ్రాన్ ఇన్నిరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు వృధాగా మారాయి.
ఐఎంఎఫ్‌ను ఒప్పించేందుకు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్ చర్చలు జరిపాడు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా, దక్షిణ-మధ్య ఆసియా సంయుక్త సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూతో భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఐఎంఎఫ్‌తో పాకిస్తాన్ నిరాశ చెందడం ఇది రెండోసారి. జూన్‌లో మొదటి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఐఎంఎఫ్ మొండి చెయ్యివ్వడంతో ఇప్పుడు రుణం పొందేందుకు చైనా లేదా గల్ఫ్ దేశాలను అభ్యర్థించే అంశంపై ప్రభుత్వంలో చర్చ ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి..
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
మొక్కలను ప్రేమించిన పల్లా వెంకన్న : వెంకయ్యనాయుడు
ఆ రోజు ఎవరికీ కనిపించకుండా పోతాను: సానియా మీర్జా.. ఏ రోజు.. ఎందుకు?
టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
హైతీలో అమెరికా మిషనరీలు కిడ్నాప్
పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

