Windows 11 : విండోస్ 11 ఓఎస్ కు అప్ గ్రేడ్ అవుతున్నారా? మీ పీసీలో విండోస్ 11 ఎలా అప్ గ్రేడ్ చేసుకోవాలో తెలుసా?
విండోస్ 11 ఓఎస్ కు అప్ గ్రేడ్ అవుతున్నారా? | విండోస్ 10 ఓఎస్ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ను ఇటీవల ప్రకటించింది. అయితే
విండోస్ 10 ఓఎస్ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ను ఇటీవల ప్రకటించింది. అయితే.. విండోస్ 11 కు అప్ గ్రేడ్ కావాలంటే మినిమమ్ సిస్టమ్ రిక్వైర్ మెంట్స్ ఉండాలి. లేకపోతే విండోస్ 11కు అప్ గ్రేడ్ అవడం కుదరదు. విండోస్ 11కు అప్ గ్రేడ్ కావాలంటే పవర్ ఫుల్ హార్డ్ వేర్ ఉండాలని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది.

విండోస్ 11 కు అప్ గ్రేడ్ కావాలంటే ఖచ్చితంగా ప్రాసెసర్ 64 బిట్ ఆర్కిటెక్చర్ ను కలిగి ఉండాలి. సీపీయూ క్లాక్ స్పీడ్ 1 జీహెచ్ జెడ్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఏఎండీ రైజెన్ 3, ఇంటెల్ ఎనిమిదో జనరేషన్ లేదా అంతకంటే ఎక్కువ వేరియంట్ ఉన్న క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7సీ ప్రాసెసర్ ను కలిగి ఉండాలి. 64 జీబీ లేదా అంతకంటే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉండాలి. ర్యామ్ స్పీడ్ మినిమమ్ 4 జీబీ ఉండాలి. డబ్ల్యూడీడీఎం 2.0 డ్రైవర్ లేదా అంతకంటే ఎక్కువ డైరెక్ట్ ఎక్స్ 12 సిస్టమ్ ను కలిగి ఉండాలి.
పీసీ హెల్త్ చెక్ అప్లికేషన్ హెల్ప్ తో విండోస్ 11 కంపాటిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మైక్రోసాఫ్ట్ పీసీ హెల్త్ చెక్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని దాన్ని రన్ చేస్తే.. పీసీలో ఉండే కంపాటిబిలిటీ సమస్యలను చూపిస్తుంది. ఒకవేళ ఎలాంటి కంపాటిబిలిటీ ఇష్యూస్ లేకపోతే.. పీసీని విండోస్ 11కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Data Stealing : ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
మీరు లొడలొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోసమే ఈ యాప్స్
Six Pack : సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Free wifi : ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

