స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ సిరీస్ గురించి ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. గత నెలలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. అత్యధిక వ్యూస్‌ను సాధించడంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు ఎనలేని లాభాలను తీసుకొచ్చింది.
అయితే.. స్క్విడ్ గేమ్ పేరుతో చాలా మొబైల్ యాప్స్ వచ్చాయి. స్క్విడ్ గేమ్ పాపులారిటీని తమవైపునకు తిప్పుకునేందుకు చాలామంది కొన్ని వందల స్క్విడ్ గేమ్ యాప్స్‌ను డెవలప్ చేశారు. అందులో ఒకటి Squid Game Wallpaper 4K HD. ఈ యాప్‌ను ఇప్పటికే 5 వేల మంది ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు.
ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత.. ఫోన్లో ఆటోమెటిక్‌గా ఈ యాప్‌ను మాల్వేర్ను ఇన్స్టాల్ చేస్తోందట. ఆ మాల్వేర్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాక.. ఫోన్లోని సెన్సిటివ్ డేటాను హ్యాకర్లకు చేరవేస్తుంది. పలు లింక్స్, ఎస్ఎంఎస్లు, సైన్ అప్ల పేరుతో యూజర్ల డేటాను హ్యాకర్లకు పంపిస్తుంది. ఆ తర్వాత హ్యాకర్లు ఫోన్లోని సెన్సిటివ్ డేటాను యాక్సెస్ చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడతారు.
ఈ యాప్.. మాల్వేర్ను ఫోన్‌ను ఇన్స్టాల్ చేస్తోందని గూగుల్‌కు ఓ రీసెర్చర్ ఫిర్యాదు చేయడంతో వెంటనే గూగుల్.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌ను తొలగించింది. అప్పటికే ఆ యాప్ 5 వేల ఫోన్లలో ఇన్స్టాల్ అయినట్టు గూగుల్ గుర్తించింది. ఆ యాప్.. ఫోన్లలో ఇన్స్టాల్ చేస్తున్న మాల్వేర్ పేరు జోకర్ మాల్వేర్గా గుర్తించారు. ఇలా స్క్విడ్ గేమ్‌కు సంబంధించిన 200 యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండటంతో.. ఆ గేమ్‌కు సంబంధించిన యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకునేందుకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Squid Game themed Android Joker
— Lukas Stefanko (@LukasStefanko) October 19, 2021
1) downloads and executes native lib
2) native lib downloads and executes apk payload
Running this app on device might result in malicious ad-fraud and/or unwanted SMS subscription actionshttps://t.co/PTDtPlUkBy pic.twitter.com/AFs8gkEuab
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
PhonePe: మొబైల్ రీచార్జ్‌పై ఫోన్‌పే ప్రాసెసింగ్ ఫీజు.. ఇలా అయితే కష్టం అంటున్న నెటిజన్లు
JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?
Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే