Whatsapp | వాట్సాప్ ఛాటింగ్ చేసేటప్పుడు ఇక ముందు వెనుక చూసుకోవాల్సిందే!! ఉన్నాయి కదా అని ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు రకరకాల ఎమోజీలు పంపే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే !! ఎందుకంటే రెడ్ హార్ట్ ఎమోజీని పంపిస్తే 20 లక్షల జరిమానా కట్టాల్సిందే. అంతే కాదు రెండు నుంచి ఐదేండ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అయితే ఇది మన దగ్గర కాదులేండీ !! ఎప్పుడూ కఠిన చట్టాలు తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్న సౌదీ ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం.. వాట్సాప్‌లో పలు రకాల ఎమోజీలు, ఎక్స్ప్రెషన్స్ పంపించడం వేధింపుల నేరం కిందకు వస్తుందని సౌదీ అరేబియాకు చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ వెల్లడించారు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా రెడ్ హార్ట్ ఎమోజీ పంపించినా.. చాట్ చేసినా నేరమేనని స్పష్టం చేసింది. దీనికి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. రెడ్ హార్ట్ ఎమోజీ పంపించిన వారికి 20 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. ఇలాంటి కేసుల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు దోషిగా తేలితే 60 లక్షల జరిమానాతో పాటు ఐదేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
“నంబర్ సేవ్ చేయకున్నా వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!”
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?”
ఉద్యోగాలు ఇప్పించే వాట్సాప్ గ్రూప్.. కర్ణాటక వ్యక్తి ఆలోచనకు విశేష స్పందన”
“WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి”
WhatsApp : ఇక నుంచి వాట్సప్ చాట్ బ్యాకప్స్ భద్రం.. ఇలా సెట్ చేసుకోండి”