న్యూఢిల్లీ: వాట్సాప్ చూడనిదే రోజు గడవని కాలం ఇది. వ్యక్తిగత సందేశాలతో పాలు బిజినెస్‌కు కూడా ఇప్పుడు వాట్సాప్ ఎంతో కీలకం. అయితే బిజినెస్ చేసేవారు వేల మందికి సందేశాలు పంపాల్సి ఉంటుంది. వాట్సాప్లోనేమో పేరు సేవ్ చేసుకోనిదే మెసేజ్ చేయలేం. అలా అని వేల మంది పేర్లు ఫోన్లో సేవ్ చేసుకోలేము. దీనికి పరిష్కారం ఉంది. ఫోన్లో పేరు సేవ్ చేసుకోకున్నా వాట్సాప్‌లో చాట్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఇందుకోసం
గూగుల్ లాంటి వెబ్ బ్రౌజర్ సెర్చ్ బాక్స్‌లో https://wa.me/ఫోన్ నంబర్ (మెసేజ్ చేయాలనుకొంటున్న నంబర్ టైప్ చేయాలి).
ఫోన్ నంబర్‌కు ముందు కంట్రీ కోడ్ రాయాలి(ఇండియా అయితే 91). ఎంటర్ నొక్కగానే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మనం ఎంటర్ చేసిన నంబర్‌తో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా సందేశాలు పంపవచ్చు.