whatsapp | వాట్సాప్ 180 దేశాలకు విస్తరించింది. మొత్తం 60 భాషల్లో అందుబాటులో ఉంది.మన దేశంలో వాట్సాప్ వాడుతున్నవారి సంఖ్య 53 కోట్లు. వాట్సాప్ ( whatsapp )లో అధికశాతం కాలక్షేప సమాచారమే ఉంటుంది. కానీ, కర్ణాటకకు చెందిన అచ్యుతానంద ( Achuthanandan ) ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ‘ఉద్యోగ నిమిత్తం’ వాట్సాప్ ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు.
దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు లభించక లక్షలమంది ఖాళీగా ఉన్నారు. గత ఏడాది దేశంలో 5.27% నిరుద్యోగం ఉంటే అదిప్పుడు 7.11%కి పెరిగిపోయింది. కర్ణాటకకు చెందిన హెచ్ఆర్ నిపుణుడు అచ్యుతానందను ఈ పరిస్థితి కలవరానికి గురిచేసింది. తనవంతుగా వీలైనంత మందికి కొలువులు ఇప్పించాలని నిర్ణయించుకొన్నాడు. అచ్యుతానంద 20 ఏండ్లుగా మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నాడు. కాలేజీ రోజుల నుంచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. హెచ్ఆర్ మేనేజర్‌గా రోజూ ఎంతోమంది నిరుద్యోగులను చూసేవాడు. వాళ్లంతా పీజీలు, డిగ్రీలూ చేసినవాళ్లే. ఎంతోకొంత నైపుణ్యం ఉన్నవాళ్లే. అయినా, ఉద్యోగాలు లభించక ఇబ్బంది పడటం ఆవేదనకు గురిచేసింది. తనకు పరిచయం ఉన్న హెచ్ఆర్ మేనేజర్లు,కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి కొందరికైనా అవకాశం ఇప్పించాలని భావించాడు. అదే సమయంలో, యువత తమ సమయాన్ని వాట్సాప్ వీక్షణలోనే గడుపుతున్న విషయాన్ని గమనించాడు. ఆ వాట్సాప్ ద్వారానే సమస్యకు ఓ పరిష్కారం చూపాలనుకొన్నాడు. వెంటనే ‘ఉద్యోగ నిమిత్తం’ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు.
ఉద్యోగార్థులను వివిధ కంపెనీలతో అనుసంధానించడానికి వీలుగా హెచ్ఆర్ ప్రొఫెషనల్స్నూ గ్రూపులో చేర్చాడు. 50 మంది నిరుద్యోగులతో ఇది ప్రారంభమైంది. పది రోజుల్లోనే ఒకరికి ఉద్యోగం వచ్చింది. మరో పదిరోజులకు మరో ఇద్దరికి, ఆ తర్వాత వారం రోజులకు ఐదుగురికి.. ఇలా రోజురోజుకూ ఉద్యోగ విజేతల సంఖ్య పెరగసాగింది. ఉద్యోగావకాశాల కోసం అన్వేషిస్తున్న యువతకు ఇదొక దిక్సూచిలా మారింది. ఒక వాట్సాప్ పోస్ట్ జీవితాలనే మార్చేస్తున్నది.
రెండు మూడు నెలల్లోనే గ్రూపు సభ్యుల సంఖ్య 250కి చేరుకున్నది. ఒక గ్రూప్‌లో 250 మంది కంటే ఎక్కువ సభ్యులకు అవకాశం లేదు కాబట్టి, మరో నాలుగు గ్రూపులు క్రియేట్ చేశాడు. టెలిగ్రామ్ యాప్‌నూ సద్వినియోగం చేసుకొన్నాడు. పురుష, మహిళా అభ్యర్థులకు వేరువేరు గ్రూపులు పెట్టాడు. ఇందుకు ఎలాంటి రుసుమూ తీసుకోడు. ‘నిరుద్యోగులకు, ఆయా కంపెనీల హెచ్ఆర్
ప్రొఫెషనల్స్‌కు మధ్య నేను వారధిలాంటి వాడిని మాత్రమే’ అంటాడు అచ్యుతానంద. అప్పటికే కాలేజీ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, మెయింటెనెన్స్ ఖర్చులు.. అంటూ లక్షల రూపాయలు ఖర్చుచేసిన వారినుంచి మరింత డబ్బు వసూలు చేయడం తనకు ఇష్టంలేదని చెబుతాడు. ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు చూసి పెడుతూనే.. మరోవైపు విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి అంశాల్లో అవగాహనా కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాడు. విద్య అనేది వ్యాపార చట్రంలోంచి బయటికి వస్తేనే దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అచ్యుతానంద అభిప్రాయం. ఆయన క్రియేట్ చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రస్తుతం 21 వేల మంది ఉద్యోగార్థులు, 700 మంది హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. 2,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ సంఖ్య ప్రతీ నెలా పెరుగుతూనే ఉంది.
ఎంతోకొంత నైపుణ్యం ఉన్నవాళ్లే. అయినా, ఉద్యోగాలు లభించక ఇబ్బంది పడటం ఆవేదనకు గురిచేసింది. తనకు పరిచయం ఉన్న హెచ్ఆర్ మేనేజర్లు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి
కొందరికైనా ఉద్యోగం చూపించాలని భావించాడు అచ్యుతానంద.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
hire a chef | టైం చెప్తే చాలు.. ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ ఇంటికొచ్చి వంట చేసి వెళ్తాడు
ఈ పాప మాములుది కాదండోయ్ .. 9 నెలలకే కుంచెపట్టి పెయింటింగ్‌లు.. నాలుగేండ్లకే అవార్డులు..
శృంగారంలో ఎంజాయ్ చేయలేకపోతున్నారా.. వీటిని అధిగమిస్తే మీరే..