టెల్అవీవ్ : హైటెక్ ప్రొఫెషనల్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇజ్రాయిల్‌కు చెందిన రీచ్మన్ యూనివర్సిటీతో చేతులు కలిపి హైటెక్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సేల్స్, డేటా అనలిటిక్స్ సహా పలు అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వర్సిటీ పేర్కొంది.
ఇజ్రాయిల్‌లో టెక్నాలజీ రంగం వేగంగా పురోగమిస్తున్నా నైపుణ్యంతో కూడిన టెకీలు కొరవడటంతో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో నైపుణ్యంతో కూడిన మానవవనరులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ చొరవ చూపింది.
ఇజ్రాయిల్ ఆర్ధిక కార్యకలాపాల్లో 15 శాతం టెక్నాలజీ రంగం నుంచే సమకూరుతుండగా ఇక్కడ ఏటా పెద్దసంఖ్యలో నూతన స్టార్టప్‌లు ఆవిష్కృతమవుతుంటాయి. 2022 ప్రధమార్ధంలో ఇజ్రాయిలీ టెక్ కంపెనీలు పది బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి.