Google Safety Charter | భారత్‌లో ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగాయి. ప్రతిరోజూ వేలాది మంది ఫిషింగ్ వెబ్‌సైట్స్, ఫేక్ యాప్స్, స్కామ్ కాల్స్‌కు బలవుతున్నారు. ఈ క్రమంలో గూగుల్ భారత యూజర్ల కోసం చొరవ తీసుకునున్నది. టెక్ కంపెనీ ‘గూగుల్ సేఫ్టీ చార్టర్’ అనే కొత్త సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ తీసుకువచ్చింది. ఇంటర్నెట్ను సురక్షితంగా ఉంచడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై నమ్మకాన్ని కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నది.
గూగుల్ సేఫ్టీ చార్టర్ వాస్తవానికి డిజిటల్ భద్రతా పాలసీ. ఇది ముఖ్యంగా భారతీయ యూజర్లను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చింది. ఇంటర్నెట్ను మరింత సురక్షితంగా మార్చడం, స్కామ్‌లను నుంచి ప్రజలను రక్షించడం. బాధ్యతాయుతమైన డిజిటల్ ఎన్విరాన్మెంట్ను సృష్టించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ చార్టర్ కింద యూజర్ డేటా భద్రతా, పారదర్శకత, స్పష్టమైన అనుమతి విధానాన్ని అనుసరించే యాప్‌లకు గూగుల్ ప్రాధాన్యం ఇస్తుంది. దాంతో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లో నకిలీ, ఆర్థిక మోసాలకు పాల్పడే యాప్స్‌ను సకాలంలో గుర్తించి వాటిని బాక్ల్ చేసే కొత్త వ్యవస్థను గూగుల్ అమలు చేస్తున్నది. దాంతో పాటు సురక్షితమైన బ్రౌజింగ్ కోసం యూజర్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలతో పాటు సూచనలు, సెక్యూరిటీ వార్నింగ్ కూడా పంపుతుంది.
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఆన్లైన్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు సైతం ప్రమాదకరస్థాయికి పెరిగాయి. కేవైసీ పేరుతో ఫేక్‌కాల్స్, లింక్‌లపై క్లిక్ చేస్తే డబ్బును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం సర్వసాధారణంగా మారాయి. ఈ క్రమంలో గూగుల్ భారతీయ యూజర్ల కోసం ఈ కీలక చర్యలు చేసుకున్నది. ఫోస్పే, గూగుల్ పే, పేటీఎం, బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ తదితర ప్రముఖ యాప్స్ అన్నీ ఈ చార్టర్లో భాగం కానున్నాయని గూగుల్ తెలిపింది. సేఫ్టీ చార్టర్‌ను అనుసరించే ప్లేస్టోర్‌లోని యాప్‌లకు గూగుల్ త్వరలోనే ‘సేఫ్టీ వెరిఫైడ్’ ట్యాగ్ ఇవ్వబోతున్నది.
ఏదైనా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు రేటింగ్, డౌన్లోడ్ నెంబర్, పర్మిషన్స్‌ను తనిఖీ చేయాలంటూ యూజర్లకు సూచిస్తుంది. ఈ గూగుల్ చొరవతో యూజర్ల భద్రతా ప్రమాణాలు మరింత పెరగనున్నాయి. గూగుల్ వెరిఫైడ్ ట్యాగ్ కారణంగా మోసపూరిత, ఫేక్ యాప్స్‌ను గుర్తించడం సులభమవుతుంది. దాంతో యూజర్లు సైబర్ నేరాల బారినపడే ప్రమాదం తగ్గనున్నది.