Samsung : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని వచ్చే ఏడాది జనవరి 11న లాంఛ్ చేయనుంది. టెక్ నిపుణుడు గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ తాజా ఇమేజ్‌లను షేర్ చేశాడు. జనవరి 11న ఈ హాట్ డివైజ్ కస్టమర్ల ముందుకు రానుందని డిస్ప్లేలో పేర్కొన్నాడని గిజ్మో చైనా వెల్లడించింది.
5జీ సపోర్ట్‌తో రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 6.41 ఇంచ్ అమోల్డ్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లేతో 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో ఆకట్టుకోనుంది. ఇక స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఈ డివైజ్ వైర్‌లైస్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇన్ స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లతో ఈ స్మార్ట్‌పోన్ కస్టమర్ల ముందుకు రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ రూ 69,900కు లభిస్తుందని అంచనాలు వెల్లడవుతున్నాయి.