Redmi Smart TV: అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ స్మార్ట్ టీవీ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ స్మార్ట్ టీవీ సిరీస్ | జియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ త్వరలోనే స్మార్ట్ టీవీ మోడల్స్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.
జియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ త్వరలోనే స్మార్ట్ టీవీ మోడల్స్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 22న ఇండియాలో స్మార్ట్ టీవీ సిరీస్‌ను రెడ్మీ లాంచ్ చేయనుంది. స్మార్ట్ టీవీ డిజైన్, ఫీచర్లను కూడా రెడ్మీ ప్రకటించింది. 32, 43 ఇంచ్ సైజ్‌లో రానున్న స్మార్ట్ టీవీలో సరికొత్త ఫీచర్లు ఉండనున్నాయి.

డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ ఫార్మాట్‌తో 20 వాట్స్ ఆడియో ఔట్పుట్, వివిడ్ పిక్చర్ ఇంజన్(వీపీఈ), జియోమీ ఇన్ హౌస్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ప్యాచ్‌వాల్ 4, బ్లూటూత్ వీ5.0, డ్యుయల్ బాండ్ వైఫై, ఆటో లేటెన్సీ మోడ్ లాంటి బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీ సిరీస్ రిలీజ్ కానుంది.
రెడ్మీ ఇప్పటికే స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ పేరుతో స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఎంఐ కూడా బ్రాండ్ నుంచి స్మార్ట్ టీవీలు ఇండియాలో రిలీజ్ అవుతుంటాయి. ఇక.. రెడ్మీ నుంచి లాంచ్ కానున్న ఈ టీవీల ధర కూడా తక్కువగానే ఉండనుందట. 30 వేల రూపాయల రేంజ్‌లోనే ఈ టీవీలను అమ్మనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రెడ్మీ టీవీలలో 32, 43 ఇంచ్ స్మార్ట్ టీవీల ధరలు.. 15 వేల నుంచి 30 వేల లోపే ఉన్నాయి.
అయితే.. ఇటీవలే ఎంఐ బ్రాండ్ పేరును తమ ప్రొడక్ట్స్ మీద తొలగించి.. జియోమీ పేరును మాత్రమే ఎంఐ ద్వారా తయారయ్యే ప్రొడక్ట్స్‌కు ఇక మీద నుంచి పెట్టనున్నట్టు జియోమీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రెడ్మీ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ పేరులో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. కేవలం ఎంఐ బ్రాండ్ పేరును తొలగించి.. జియోమీ పేరునే లోగోగా ఇక నుంచి ఉపయోగించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
iOS 15 Release Date | ఐఫోన్ 13 వచ్చేసింది.. భారత్‌లో ధరలు ఇలా..
iPhone 13 | లాంచ్‌లో దమ్ మారో దమ్ సాంగ్‌తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
ఐఫోన్ యూజర్లూ.. బైక్‌పై వెళ్తున్నారా? మీ కెమెరా పాడవ్వచ్చు జాగ్రత్త!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

