ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!

iOS 15 release date | ఐఫోన్ యూజర్లు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 13 ( iPhone 13 ) మోడల్‌ను యాపిల్ ( apple ) సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. గతేడాది వచ్చిన ఐఫోన్ 12 మోడల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఐఫోన్ 13 మోడల్‌ను విడుదల చేసింది. ఇదే సమయంలో ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఐవోఎస్ 15 ( iOS 15 ) ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల తేదీని కూడా యాపిల్ సంస్థ ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో అంటే.. సెప్టెంబర్ 20వ తేదీన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. కొద్ది వారాల క్రితమే ఐఫోన్ లో వాడే ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 14.7.1 ను ఇటీవలే రిలీజ్ చేశారు. అందులో కొత్త ఫీచర్స్ ను యాడ్ చేసినా.. త్వరలో రిలీజ్ చేయబోయే ఐవోఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇంకా మరిన్ని ఫీచర్స్‌ను యాపిల్ కంపెనీ తీసుకురాబోతోంది. మరి ఆ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దామా..
FaceTime Calling
వీడియో కాలింగ్ ఫీచర్ ను ఐఓఎస్ 15 లో అప్ డేట్ చేసింది. ఫేస్ టైమ్ అనే ఫీచర్ లో వీడియో కాల్ పార్టిసిపెంట్స్ ను గ్రిడ్ వ్యూలో చూడొచ్చు. ఫేస్ టైమ్ లింక్స్ ను క్రియేట్ చూసి యూజర్స్ తమ ఫ్రెండ్స్ ను, కాంటాక్ట్స్ లిస్టులో ఉన్నవాళ్లను వీడియో చాట్ కోసం ఆహ్వానించవచ్చు. ఆ లింక్ ద్వారా వేరే వాళ్లు.. ఆ వీడియో చాట్ లో యాడ్ కావచ్చు.
SharePlay
షేర్ ప్లే ఫీచర్ ను ఉపయోగించి ఒక యాపిల్ డివైజ్ నుంచి ఇంకో యాపిల్ డివైజ్ కు సినిమాలు, మ్యూజిక్ ను షేర్ చేసుకోవచ్చు. డివైజ్ స్క్రీన్ ను కూడా ఈ ఫీచర్ ఉపయోగించి షేర్ చేయొచ్చు. యాపిల్ టీవీ ప్లస్ యాప్ నుంచి ఈ ఫీచర్ ద్వారా మూవీస్, టీవీ షోలను షేర్ చేసే విధంగా షేర్ ప్లే అనే ఆప్షన్ ను యాపిల్ తీసుకురానుంది.
Apple Maps
యాపిల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్స్ ను యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 3డీ లాండ్ మార్క్స్, నైట్ మోడ్, డ్రైవింగ్ డైరెక్షన్స్, రోడ్ కలర్స్ లాంటి కొత్త ఫీచర్స్ ను యాడ్ చేసింది. యూజర్ లొకేషన్ కు సమీపంలో ఉండే ల్యాండ్ మార్క్ ను పిన్ చేస్తే.. యూజర్.. ఆ లొకేషన్ కు చేరుకోగానే డెస్టినేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది.
Notifications
నోటిఫికేషన్స్ ను మేనేజ్ చేసుకునే ఫీచర్ ను ఐఓఎస్ 15 లో తీసుకురానున్నారు. ఐఫోన్ యూజర్ కు ఏ నోటిఫికేషన్స్ కావాలి… ఏ నోటిఫికేషన్స్ వద్దో స్పెసిఫిక్ గా సెట్ చేసుకుంటే.. దానికి సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది.
Apple iMessage
ఐమెసేజ్ ఫీచర్ ను ఐఓఎస్ 15 లో అప్ గ్రేడ్ చేశారు. Shared with you అనే ఫోల్డర్ లో యూజర్ షేర్ చేసిన ఆర్టికల్స్, ఫోటోలు, ప్లే లిస్ట్ యాడ్ అవుతాయి. యూజర్ కాంటాక్ట్ లో ఉన్నవాళ్లు షేర్ చేసినవి కూడా అదే ఫోల్డర్ లో యాడ్ అయి ఉంటాయి. దీని వల్ల.. ఈజీగా షేర్ చేసిన మీడియా ఫైల్స్ ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఐవోఎస్ 15 అందుబాటులో ఉండే మొబైల్స్
| iPhone 13 iPhone 13 mini iPhone 13 Pro iPhone 13 Pro Max | iPhone 8 iPhone 8 Plus |
| iPhone 12 iPhone 12 mini iPhone 12 Pro iPhone 12 Pro Max | iPhone 7 iPhone 7 Plus |
| iPhone 11 iPhone 11 Pro iPhone 11 Pro Max | iPhone 6s iPhone 6s Plus |
| iPhone Xs iPhone Xs Max iPhone Xr iPhone X | iPhone SE (1st generation) iPhone SE (2nd generation) iPod touch (7th generation) |
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iOS 15 Release Date | ఐఫోన్ 13 వచ్చేసింది.. భారత్‌లో ధరలు ఇలా..
iPhone 13 | లాంచ్‌లో దమ్ మారో దమ్ సాంగ్‌తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
ఐఫోన్ యూజర్లూ.. బైక్‌పై వెళ్తున్నారా? మీ కెమెరా పాడవ్వచ్చు జాగ్రత్త!
IPhone | మీ దగ్గర ఐఫోన్ ఉందా.. వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి.. లేదంటే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

