ఐఫోన్ 13 వచ్చేసింది.. భారత్‌లో ధరలు ఇలా..

కాలిఫోర్నియా, సెప్టెంబర్ 14: ఐఫోన్ ప్రియులు ఆసక్తిగా వేచిచూస్తున్న తరుణం వచ్చేసింది. టెక్ దిగ్గజం యాపిల్ మంగళవారం కొత్త ఐఫోన్ 13 మోడల్స్‌ను ఆవిష్కరించింది. ప్రతీ ఏడాదిలానే ఈ సెప్టెంబర్ 14న కాలిఫోర్నియాలో జరిగిన ‘యాపిల్ ఈవెంట్’లో ఐఫోన్ 13 శ్రేణిని విడుదల చేశారు. గతేడాది వచ్చిన ఐఫోన్ 12 మోడల్‌తో పోల్చితే 13లో కొద్దిపాటి మార్పులు చేశారు. కెమెరా సెన్సార్, మెరుగైన అల్ట్రావైడ్ కెమెరాల్ని అమర్చారు. ఐఫోన్ 13(6.1 అంగుళాలు), ఐఫోన్ 13 మిని (5.4 అంగుళాలు)ల్లో 128 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఐఫోన్ 13 ప్రొ(6.1 అంగుళాలు), ఐఫోన్ ప్రొ మ్యాక్స్(6.7 అంగుళాలు) 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వెర్షన్లతో విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి ముందస్తు బుకింగ్‌లు. 24 నుంచి అందుబాటులోకి వస్తాయి
ఫీచర్లు ఇవీ…
- కొత్త రంగులు పింక్, బ్రాంజ్, గ్రాఫైట్ గ్రేల్లో సైతం లభిస్తాయి.
- శక్తివంతమైన సీపీయూతో 50 శాతం ఫాస్ట్‌గా పనిచేస్తుంది.
- అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు
- గత మోడల్స్‌తో పోలిస్తే బ్యాటరీలు పెద్దవి. ఇంటర్నల్ స్పేస్ సేవింగ్ డిజైన్ కారణంగా బరువు కూడా ఎక్కువే.
- ఐఫోన్ 12తో పోలిస్తే బ్యాటరీ లైఫ్ 2.5 గంటలు ఎక్కువ.
- వేగవంతమైన 6ఈ స్టాండర్డ్ వైఫైని, 5జీ సర్వీసుల్ని సపోర్ట్ చేస్తుంది.
- ఈవెంట్లో నూతన శ్రేణి థర్డ్ జనరేషన్ ఐపాడ్స్‌ను, కొత్త యాపిల్ వాచ్ 7 సిరీస్‌ను (5జీ ఎనేబుల్డ్) కూడా ఆవిష్కరించారు.
ఐప్యాడ్లు..
- ఐప్యాడ్ ప్రారంభ ధర: 360 డాలర్లు
- ఐప్యాడ్ మినీ ప్రారంభ ధర: 499 డాలర్లు
- డిస్ప్లే: 8.3 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే
- ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సల్
- బ్యాంక్ కెమెరా: 12 మెగాపిక్సల్
- ఇతర ఫీచర్లు: స్మార్ట్ హెచ్డీఆర్, 4కే వీడియో రికార్డింగ్, వైఫై, సెల్యులార్ కన్ఫిగరేషన్స్, యూఎస్బీ-సీ పోర్ట్, 5జీ మోడెమ్, ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో స్టీరియోతో సరికొత్త స్పీకర్ వ్యవస్థ
యాపిల్ వాచ్ సిరీస్ 7
- ప్రారంభ ధర: 399 డాలర్లు
- 41ఎంఎం, 45ఎంఎం సైజుల్లో లభ్యం
- బ్యాటరీ సామర్థ్యం: 18 గంటల వరకు
- యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌పై చార్జింగ్
- క్రాక్ రెసిస్టెంట్ టెక్నాలజీ
భారత్‌లో ధరలు ఇలా.. (అంచనా)
13 మినీ రూ.69,900
13 రూ.79,000
13 ప్రొ రూ.1,19,900
13 ప్రొ మాక్స్ రూ.1,29,900
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

