I Phone | మీ దగ్గర ఐఫోన్ ఉందా.. వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి.. లేదంటే..!

న్యూఢిల్లీ: మీ దగ్గర ఆపిల్ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లేదా మ్యాక్ ఉందా? అయితే వెంటనే అందులోని సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోండి. ఆపిల్ ఊహించనివిధంగా 14.7.1 వెర్షన్‌ను రిలీజ్ చేసి తమ యూజర్లందరూ వెంటనే దీనికి అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది. గత వెర్షన్లలో ఉన్న ఓ సెక్యూరిటీ లోపాన్ని సరి చేసి ఈ వెర్షన్‌ను ఆపిల్ రిలీజ్ చేసింది. ఐఫోన్ అయితే ఐఓఎస్ 14.7.1, ఐప్యాడ్ అయితే ఐప్యాడ్ఓఎస్ 14.7.1, మ్యాక్‌బుక్, ఐమ్యాక్ అయితే మ్యాక్ఓఎస్ బిగ్ సర్ 11.5.1కు అప్డేట్ చేసుకోవాలి.
గత వెర్షన్లలో టచ్ ఐడీ ఉన్న ఐఫోన్‌తో పెయిర్ అయి ఉన్న ఆపిల్ వాచ్‌ను అన్‌లాక్ విత్ ఐఫోన్ ఫీచర్‌తో అన్‌లాక్ చేయడానికి రాలేదని, ఈ కొత్త వెర్షన్ ఆ లోపాన్ని సరి చేసిందని ఆపిల్ చెప్పింది. అంతేకాదు ఈ కొత్త వెర్షన్‌తో ఓ కీలకమైన సెక్యూరిటీ లోపాన్ని కూడా ఆపిల్ సవరించింది. ఐఫోన్లను పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేయడానికి కారణమైన ఐమెసేజ్లోని జీరో క్లిక్ లోపాన్ని ఈ వెర్షన్‌తో సరి చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త అప్డేట్తో గతంలో లేనంత సెక్యూర్డ్‌గా మీ ఆపిల్ డివైస్‌లు ఉండనున్నాయని సంస్థ తెలిపింది. ఐఫోన్ 6ఎస్, ఆపై మోడల్స్‌కు ఈ కొత్త వెర్షన్ అందుబాటులో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

