Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
Sundeep Kishan | సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా సోషియో-ఫాంటసీ చిత్రం 'కరికాల'. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.
Sundeep Kishan | సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా సోషియో-ఫాంటసీ చిత్రం ‘కరికాల’. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, గురువారం నాడు ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పురాణాలు, అద్భుతమైన సాహసాలు, మాయాలోకాల నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. అలాగే తొలి సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ వేడుక అనంతరం చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, తన మిత్రుడు ఆది వల్లే దర్శకుడు యుగంధర్, నిర్మాతలు రాజశేఖర్, మహిధర్ పరిచయమయ్యారని తెలిపారు. దర్శకుడు ఈ కథను రెండు భాగాలుగా వివరించినప్పుడు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదని, గత ఆరేడు నెలలుగా దర్శకుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి అంకితభావం ఉన్న దర్శక-నిర్మాతలు దొరకడం తన అదృష్టమని, ‘కరికాల’ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన నిర్మాతలకు, హీరో సందీప్ కిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ఒక అందమైన చందమామ కథలా ఉంటుందని, నాగలోకం, వానర లోకం వంటి అద్భుతమైన కల్పిత ప్రపంచాలను ఇందులో సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేశామని, వచ్చే ఏడాదే రెండు చాప్టర్లను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ, తమ మొదటి చిత్రం ‘శంబాల’కు మీడియా అందించిన సపోర్టే ‘కరికాల’కు కూడా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, సందీప్ కిషన్ కథ విన్న వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారని చెప్పారు.
నటి కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత తన పాత్ర కోసం ఇంతగా ఎగ్జైట్ అయ్యానని, దర్శకుడు యుగంధర్ ఈ సినిమా ప్రపంచాన్ని సృష్టించడానికి ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించారు. అలాగే గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన మాయాలోకాన్ని కనువిందు చేస్తుందని, ఇందులో తాను ఒక రాజకుమారిగా నటిస్తున్నానని తెలిపారు. సాక్షి మడోల్కర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో సందీప్ కిషన్ పక్కన నటించడం ఎంతో ఆనందంగా ఉందని, కరికాల ప్రపంచం అందరినీ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ, ఇది తన కెరీర్లో 59వ సినిమా అని, ఈ తరహా యూనిక్ జోనర్లో సంగీతం అందించడానికి చాలా స్కోప్ ఉందని తెలిపారు. త్రిభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీలను మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు. ఈ చిత్ర మొదటి చాప్టర్ 2027 జూలై 2న, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

